Loading video

స్టార్‌ హీరో కోసం 3 స్క్రిప్ట్‌లు రెడీ చేసిన టీమిండియా క్రికెటర్‌

|

Mar 18, 2025 | 8:27 PM

ఇండియాలో క్రికెట్‌, సినిమా ఈ రెండు రంగాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెటర్లను, సినిమా హీరోలను చాలా మంది యువత రోల్‌ మోడల్స్‌లా భావిస్తూ ఉంటారు. మరికొంత మంది వాళ్లను డెమీ గాడ్స్‌లా కొలుస్తారు. ఇక క్రికెట్‌, సినిమా కలిస్తే ఆ జోడీ అదిరిపోతుంది. ఈ ఆలోచన నుంచి పుట్టిందే ఐపీఎల్‌ కూడా.

బాలీవుడ్‌ స్టార్స్‌తో ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలు కొనిచ్చి.. సినిమా, క్రికెట్‌ను మిక్స్‌ చేశానంటూ ఐపీఎల్‌ తొలి ఛైర్మన్‌ లలిత్‌ మోదీ గతంలో ప్రకటించారు. అయితే తాజాగా ఓ టీమిండియా క్రికెటర్‌.. మరో అడుగు ముందుకు వేసి.. ఓ స్టార్‌ హీరో కోసం ఏకంగా రెండు, మూడు కథలు సిద్ధం చేసినట్లు వెల్లడించాడు. ఆ క్రికెటర్‌ మరెవరో కాదు మిస్టరీ స్పిన్నర్‌ వరణ్‌ చక్రవర్తి. ఇటీవలె ముగిసిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో అద్బుత ప్రదర్శన కనబర్చడంతో పాటు ఐపీఎల్‌కు సిద్ధం అవుతున్న తరుణంలో వరుణ్‌ ఆసక్తికర స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. తానకు తలపతి విజయ్‌ అంటే చాలా ఇష్టమని, అతన్ని మైండ్‌లో పెట్టుకొని ఓ రెండు, మూడు స్క్రిప్ట్‌లు కూడా రాసుకున్నట్లు వరుణ్‌ చక్రవర్తి తెలిపాడు. వరుణ్‌కు క్రికెట్‌తో పాటు సినిమాలంటే కూడా పిచ్చి. గతంలో ఒకటీ రెండు సినిమాల్లో కూడా నటించాడు. ఆ పిచ్చితోనే విజయ్ కోసం కథలు కూడా రాసుకున్నాడంటూ చెప్పాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: దిమ్మతిరిగే న్యూస్.. RC16లో మెగా స్టార్ | బుల్లిరాజుకు భారీగా డిమాండ్‌ లక్షల్లో రెమ్యునరేషన్‌

Nayanthara: రూ.100 కోట్లతో ఇల్లు కమ్‌ స్టూడియో నిర్మించుకున్న నయన్

ఎయిర్‌టెల్‌ బాటలోనే జియో.. మస్క్‌తో రిలయన్స్‌ డీల్‌

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

మీ ఇంటి ఆవరణలో బొప్పాయి చెట్టు ఉందా.. వెంటనే..!