Varalakshmi Sharatkumar: అవును, నా భార్తకు ఆ్రలెడీ పెళ్లైంది.. తప్పేంటి.? ఒక్కొక్కరికీ ఇచ్చిపడేసింది.!

|

May 09, 2024 | 2:04 PM

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌.. తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస విజయాలతో టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ యాక్టర్‌గా మారిపోయారు. గ్లామర్ పాత్రలు చేయకపోయినా పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే వాటిని క్రమం తప్పకుండా దక్కించుకుంటున్న ఈ కోలీవుడ్ ఆర్టిస్ట్ నటించిన శబరి చిత్రం ఇటీవలే రిలీజ్‌ అయింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియాకు ఇంటర్వ్యూలో వరలక్ష్మీ తన కాబోయే భర్తగురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌.. తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస విజయాలతో టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ యాక్టర్‌గా మారిపోయారు. గ్లామర్ పాత్రలు చేయకపోయినా పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే వాటిని క్రమం తప్పకుండా దక్కించుకుంటున్న ఈ కోలీవుడ్ ఆర్టిస్ట్ నటించిన శబరి చిత్రం ఇటీవలే రిలీజ్‌ అయింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియాకు ఇంటర్వ్యూలో వరలక్ష్మీ తన కాబోయే భర్తగురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనకు కాబోయే భర్త నికోల‌య్‌కి తనకి మధ్య అనుకోకుండా ప్రేమ పుట్టిందన్నారు. అత‌డు తన వృత్తిని గౌర‌విస్తాడని, సినిమాలు ఆపేసి ఇంట్లో కూర్చో అని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు.

అంతేకాదు తనను చూసి గర్వపడతాడని, తనతోపాటు షూటింగ్స్‌వస్తాడని, తను చేసే పనిని అతను ఎంజాయ్‌ చేస్తాడని తెలిపారు. అతనిలో ఆ క్వాలిటీ తనకు నచ్చిందని, అందుకే అతనితో జీవితం పంచుకోవాలనిపించిందని తెలిపారు. తామిద్దరూ ఒకరికొకరు సపోర్ట్‌ చేసుకుంటామని వివరించారు. నికోలయ్‌ ఓ గ్యాల‌రిస్టు.. అంటే పెద్దపెద్ద క‌ళాకారులు వేసే పెయింటింగ్స్‌ను కొని అమ్ముతుంటాడని తెలిపారు. అతనికి ఇదివరకే పెళ్లయిందని, వరలక్ష్మి ఓ పెళ్లయినవాడిని పెళ్లిచేసుకుంటుందంటూ రాతాలు రాశారని, పెళ్లయితే తప్పేంటని ప్రశ్నించారు. మీ పని మీరు చూసుకోండి.. నా లైఫ్‌ నా ఇష్టం.. అందరూ ఐశ్వర్యారాయ్‌, బ్రాడ్‌పిట్‌లేం కాదు, డబ్బుకోసం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు.. నా దగ్గరా డబ్బు ఉంది. మీకు నచ్చినట్టు రాసుకోండి.. ఐ డోంట్‌ కేర్‌ అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు వరలక్ష్మి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.