Upasana- Ram charan: పుట్టబోయే బిడ్డ గురించి మొదటిసారి ఉపాసన.. చాలా భావోద్వాగానికి గురయ్యానంటూ.
తనకు పుట్టబోయే బిడ్డ గురించి మొదటిసారి ట్వీట్ చేశారు ఉపాసన. ఈసందర్భంగా తాను ఎంతో భావోద్వేగానికి గురవుతున్నట్లు చెప్పారు. తన భర్త రామ్‌చరణ్‌తో కలిసి
తనకు పుట్టబోయే బిడ్డ గురించి మొదటిసారి ట్వీట్ చేశారు ఉపాసన. ఈసందర్భంగా తాను ఎంతో భావోద్వేగానికి గురవుతున్నట్లు చెప్పారు. తన భర్త రామ్‌చరణ్‌తో కలిసి ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఉపాసన తన ఆనందాన్ని ట్విట్టర్‌ద్వారా పంచుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌తో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌లో భాగమైనందుకు తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ‘దేశం గర్వించే విజయం ఇది,ఈ ప్రయాణంలో నేనూ భాగమయ్యేలా చేసిన రామ్‌చరణ్, దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు. నాతో కలిసి నా బేబీ కూడా ఈ అనుభూతిని పొందుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్షణాలు భావోద్వేగంగా అనిపిస్తున్నాయి’’ అంటూ ట్వీట్ చేశారు. దాంతో మెగా అభిమానులు ఉపాసనకు శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..