పైసలు చాలట్లేదు.. ఈ మంత్రి పదవి నాకొద్దు.. సీనియర్ హీరో ఆవేదన

Updated on: Oct 16, 2025 | 3:33 PM

ఎవరైనా మంత్రి పదవి ఇస్తే ఎగిరి గంతేస్తారు. ఆ పదవినుంచి దిగమన్నా దిగడానికి ఇష్టపడరు. కానీ కేంద్ర మంత్రి సురేష్‌ గోపి ఇందుకు భిన్నంగా నాకు ఈ మంత్రి పదవి వద్దు.. నా స్థానంలో మరొకర్ని నియమించండి.. నేను వెళ్లి సినిమాలు చేసుకుంటానని అంటున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర మంత్రి పదవి నుంచి దిగిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో తన ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని.. అందుకే మంత్రిగా దిగిపోయి మళ్లీ సినిమాల్లో నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు 200కిపైగా చిత్రాల్లో నటించిన సురేశ్‌ గోపి 2016లో బీజేపీలో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిస్సూర్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. తన సినీ జీవితాన్ని తిరిగి కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. సినీ కెరీర్‌ను వదిలిపెట్టి మంత్రి కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదన్నారు. ఇటీవల తన ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నా. మళ్లీ సినిమాల్లో నటించాలని అనుకుంటున్నానని తెలిపారు. మరోవైపు తన స్థానంలో కేరళకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీ సదానందన్‌ మాస్టర్‌కు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించాలని బీజేపీ అధిష్టాన్ని కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా భర్తతో అదే సమస్య అందుకే నాలుగేళ్లుగా శ్రీనివాస్‌తో.. తన బాధను చెప్పుకున్న మాధురి

యాడ దొరికిన సంతరా అయ్యా..బొట్టు బిళ్లల కోసం లొల్లేంట్రా

అతనితో ప్రేమలో ఉన్నా.. కానీ పెళ్లి మాత్రం చేసుకోను

కొత్త పెళ్లికొడుకుకి ఎన్టీఆర్ స్పెషల్ సర్‌ప్రైజ్‌

అంత అమాయకురాలినేం కాదు.. దీపిక తీరుపై మాజీ మంత్రి స్ట్రాంగ్ కౌంటర్