AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంత అమాయకురాలినేం కాదు.. దీపిక తీరుపై మాజీ మంత్రి స్ట్రాంగ్ కౌంటర్

అంత అమాయకురాలినేం కాదు.. దీపిక తీరుపై మాజీ మంత్రి స్ట్రాంగ్ కౌంటర్

Phani CH
|

Updated on: Oct 16, 2025 | 2:01 PM

Share

దీపిక పదుకొనే 8 గంటల పని విధానంపై కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇన్‌డైరెక్ట్‌గా దీపికకు కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె 'క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ 2' టీవీ సీరియల్ లో నటిస్తున్నారు. దాదాపు 20 ఏళ్ళ తర్వాత మళ్లీ స్మృతి నటిస్తున్న సీరియల్ ఇది. ఈ సీరియల్ ఈవెంట్లో మాట్లాడిన స్మృతి.. దీపిక ప్రతిపాదించిన 8 గంటల పనిపై రియాక్టైంది.

ఇది పూర్తిగా దీపిక పదుకొనే వ్యక్తిగత విషయం. కానీ నటులు నిర్మాతల బాగోగులు కూడా చూసుకోవాలన్నారు. కొన్ని వివాదాలు కేవలం సంచలనం కోసం సృష్టిస్తారు. అటువంటి విషయాలలో పాల్గొనేంత అమాయకురాలిని తాను కాదు. కానీ నిర్మాతలను చూసుకోవాలి, వాళ్లకు నష్టం రాకుండా చూసుకోవడం నటులుగా తమ బాధ్యతంటూ చెప్పుకొచ్చారు. పలానా రోజు పని చేయాలని తనకు అనిపించడం లేదని చెప్పడం వృత్తిపరంగా ఆమోదయోగ్యం కాదు.. సీరియల్స్ చేస్తున్నపుడే రెండుసార్లు తాను గర్భం దాల్చాను.. అప్పుడు కూడా పని చేసాను. ఒక్క రోజు మనం రాకపోతే 120 మందికి ఆ రోజు చెక్కు అందదు. అది 120 కుటుంబాలకు అన్యాయం అవుతుంది. నటిగా ఉండటం, రాజకీయాల్లో ఉండటం, తల్లిగా ఉండటం అనేవి తన ఛాయిస్ అని చెప్పిన స్మృతి దానిపై బాధ్యత తనదే అని.. అదే సమయంలో నటులుగా చేసే పనిపై అందరికీ నిబద్ధత కూడా ఉండాలంటూ ఇన్ డైరెక్టుగా దీపిక కు కౌంటర్ ఇచ్చారు స్మృతి. ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందిన దీపికా పదుకొణె తరచూ వార్తల్లో నిలుస్తోంది. ప్రభాస్ స్పిరిట్, కల్కి 2 ప్రాజెక్స్ నుంచి ఆమె తప్పుకోవడం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సరైన కారణాలేంటో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం పలు రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి. దీపికా కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తానని చెప్పడం.. అలాగే అధికంగా రెమ్యునరేషన్ అడిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే దర్శక నిర్మాతలు దీపికను తమ ప్రాజెక్టుల నుంచి తప్పించారని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హీరోయిన్‌కు వింత రోగం.. చెప్పుకోలేక.. భరించలేక తీవ్ర ఇబ్బంది

Follow Us