సినిమాలు మానేసి.. జాతకాలు చెప్పుకుంటున్న హీరోయిన్

Updated on: Aug 25, 2025 | 7:34 PM

గతంలో సినిమాల్లో నటించి తెరమరుగైన అందాల తారలు ఇప్పుడు మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ అంటూ చిన్నాచితకా పాత్రల్లో మెరుస్తున్నారు. అయితే గతంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన కొందరు ముద్దుగుమ్మలు ఇప్పుడు వ్యాపారంలో అడుగుపెట్టి.. సత్తా చాటుతున్నారు. వివిధ వ్యాపారాలతో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు.

ఈ అందాల తార కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఆస్ట్రాలజర్‌గా మారి జాతకాలు చెబుతూనే, రకరకాల వ్యాపారాలలో రాణిస్తూ కోట్లు సంపాదిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. తులిప్ జోషి. తులిప్‌ జోషి.. చివరిగా 2015లో ఓ సినిమాలో కనిపించింది. అంతే ఆ తర్వాత కనీసం సీరియల్స్ లో కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడీ బ్యూటీ బిజినెస్ లో దూసుకుపోతోంది. ఒకటి కాదు రెండు కాదు పలు వ్యాపారాలు నిర్వహిస్తూ బిజి బిజీగా ఉంటోంది. ఓ కన్సల్టింగ్ కంపెనీని నడుపుతోన్న తులిప్..అస్ట్రాలజర్‌గానూ రాణిస్తోంది. వేద జ్యోతిషం, లైఫ్ స్టైల్ కన్సల్టేషన్ గురించి సోషల్ మీడియాలో తరచూ వీడియోలు షేర్ చేస్తోంది. 2002లో యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ‘మేరే యార్ కీ షాదీ హై’ అనే సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది తులిప్ జోషి. ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో.. వెంటనే ‘మాతృభూమి’, ‘దిల్ మాంగే మోర్’ వంటి మూవీల్లోనూ అవకాశం వచ్చింది. కానీ.. స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. దీంతో దక్షిణాదికి మకాం మార్చి… రాజశేఖర్ నటించిన విలన్ సినిమాలో హీరోయిన్ గా, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త కొత్తగా అనే మూవీలోనూ ఓ కీలక పాత్ర పోషించింది. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడకపోవటంతో..ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. సల్మాన్ 2014లో హీరోగా నటించిన జయహో అనే సినిమాలో చివరిగా కనిపించింది తులిప్ జోషి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓవర్ యాక్షన్ ఎఫెక్ట్.. బిగ్‌బాస్‌కు రాకుండా గెంటేసిన జడ్డెస్

దేవుడి సినిమా దెబ్బకి చిత్తవుతున్న వార్ 2, కూలీ

ఆ సీన్‌లో లాజిక్కేది ?? వార్ 2పై RGV షాకింగ్ రివ్యూ

ఈ వయసులోనూ.. జిమ్‌లో తగ్గేదేలే అంటోన్న మెగాస్టార్..!

చిరు ఫ్యాన్ అంటే అట్లుంటది.. గూస్‌‌బంప్స్‌ తెప్పిస్తున్న శ్రీకాంత్ ఓదెల ట్వీట్‌ !