Trisha: ఇవ్వని నాకు జుజుబీ.. సెటైరికల్‌ మాటలతో సెట్ చేసి పడేసిందిగా

Edited By:

Updated on: Oct 15, 2025 | 4:42 PM

ఇష్యూస్‌ని సెటైరికల్‌గా డీల్‌ చేయడంలో త్రిష తర్వాతే ఎవరైనా... అనే మాట వినిపిస్తోంది ఇండస్ట్రీలో. తన గురించి గాసిప్స్ వచ్చిన ప్రతిసారీ వాటిని కోపంతో కాకుండా, వ్యంగ్యంగా డీల్‌ చేస్తుంటారు త్రిష. లేటెస్ట్ గా మేరేజ్‌ న్యూస్‌ని కూడా అలాగే హ్యాండిల్‌ చేశారు. అన్నట్టు కాంబోస్‌ని రిపీట్‌ చేస్తున్న ఈ బ్యూటీ త్వరలోనే మరో సూపర్‌ డూపర్‌ మూవీకి సైన్‌ చేయనున్నారా? చూసేద్దాం పదండి..

కెరీర్‌ మీద తప్ప ఇంకేదాని మీదా ఫోకస్‌ లేదని అంటున్నారు నటి త్రిష. నా పెళ్లి మాత్రమే ఎందుకు? హనిమూన్‌ని కూడా ప్లాన్‌ చేసేయండి అంటూ ఇటీవల పెళ్లి వార్తల మీద సెటైర్‌ వేశారు త్రిష. జస్ట్ ఆ సెటైర్స్ తో మాత్రమే కాదు, మరో విషయంతోనూ వైరల్‌ అవుతున్నారు ఈ బ్యూటీ. కెరీర్‌లో చేసిన హీరోలతో మళ్లీ మళ్లీ మూవీస్‌ చేస్తున్నారు త్రిష. రీసెంట్‌గా విజయ్‌తో నటించారు. మెగాస్టార్‌ చిరంజీవితో నటించిన విశ్వంభర సెట్స్ మీదుంది. వచ్చే ఏడాది సమ్మర్‌కి ఈ సినిమా విడుదలవుతుంది. స్టాలిన్‌ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో జనాల్లోనూ క్రేజ్‌ ఉంది. అటు తెలుగు, తమిళ్‌లో సూర్యతో కరుప్పు చేస్తున్నారు. సూర్య – త్రిష కాంబినేషన్‌కి మన దగ్గర పెద్ద క్రేజ్‌ లేకపోవచ్చుగానీ, తమిళ్‌లో మాత్రం యమా క్రేజ్‌ ఉంది. ఈ మూవీ తర్వాత వెంకటేష్‌తో మరోసారి ఈ బ్యూటీ జోడీ కడతారనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. వెంకీ – త్రిష కాంబో తెలుగు ఆడియన్స్ కి సో స్పెషల్‌. అయితే వెంకీ మూవీలో త్రిషకి మాత్రమే ఛాన్స్ ఉంటుందా? నిధి అగర్వాల్‌కి కూడా ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్‌ సినిమాలో మల్టిపుల్‌ హీరోయిన్లకు అవకాశాలు ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఆ క్రమంలో త్రిష మెయిన్‌ హీరోయిన్‌ అవుతారా? లేకుంటే ఇంపార్టెంట్‌ రోల్‌ చేస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Alia Bhatt: నెరవేరనున్న అలియా కల.. మరి తన నటనతో ఫ్యాన్స్ ను మెప్పిస్తారా ??

వణుకు పుట్టించడానికి సిద్ధం అంటున్న నాయికలు

వెండితెర మీద సందడి చేస్తున్న కార్టూన్ సినిమాలు

Published on: Oct 15, 2025 04:41 PM