Rajamouli: జక్కన్న విసిరిన సవాల్‌.. మరి నీల్‌ సిద్ధమేనా..

Edited By:

Updated on: Nov 27, 2025 | 5:29 PM

రాజమౌళి 'వారణాసి' అంతర్జాతీయ ప్రమోషన్లతో సినీ ప్రపంచంలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. పాన్ ఇండియాను దాటి గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, సరికొత్త బెంచ్‌మార్క్‌లు నెలకొల్పుతున్నారు. ప్రశాంత్ నీల్, ప్రభాస్ వంటి దర్శకులకు ఇది పెద్ద సవాలుగా మారింది. జక్కన్న దారిలో నడిచి, అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించేందుకు టాలీవుడ్ మేకర్స్ నూతన వ్యూహాలు రచిస్తున్నారు.

సెల్ప్‌ టార్గెట్‌ సంగతి సరే.. ఓ గ్రూపు గ్రూపుకీ టార్గెట్‌ ఇచ్చి పడేయడంలో ఉన్న సరదా ఏంటో రాజమౌళికి తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదేమో… మొన్నటికి మొన్న ప్యాన్‌ ఇండియా అని అందరినీ ఉరకెలెత్తించిన రాజమౌళి ఇప్పుడు టార్గెట్‌ ఇంటర్నేషనల్‌ అంటూ ఫిక్స్ చేశారు. వారణాసి గురించి ప్రతి రోజూ మాట్లాడుకునేంత స్టఫ్‌ ఇచ్చేశారు రాజమౌళి. కొందరు ఆ విజువల్స్, ఆ గ్రాండియర్‌ గురించి డిస్కషన్‌ షురూ చేస్తుంటే, మరికొందరు మాత్రం అంతకు మించి రాజమౌళి స్పీచ్‌ గురించి, అందులో ఆయన ఎలాంటి భావోద్వేగాలను పలికించారనే విషయం గురించి పాయింట్‌ టు పాయింట్‌ చెక్‌ చేస్తున్నారు. మీ పనుల్లో మీరుండండి.. నా పనిలో నేనుంటా అంటూ క్లైమాక్స్ పోర్షన్‌ షూట్‌ చేస్తున్నారు జక్కన్న. అంతే కాదు, ఇంటర్నేషనల్‌ లెవల్లో ఈవెంట్‌ చేసి, ప్రమోషన్లను నెవర్‌ బిఫోర్‌ అన్నట్టు బిగిన్‌ చేసి, నెక్స్ట్ లైన్లో ఉన్న డైరక్టర్లకు పెద్ద టాస్కే ఇచ్చేశారు. రోడ్డు వేయమంటే ఆరు లైన్ల ఎక్స్ ప్రెస్‌ హై వే వేశారు రాజమౌళి అంటూ రీసెంట్‌గా జక్కన్నను మెచ్చుకున్నారు ప్రశాంత్‌ నీల్‌. ఇప్పుడు కూడా రాజమౌళి వేసిన ఇంటర్నేషనల్‌ ఎక్స్ ప్రెస్‌ హైవే మీద ఇమీడియేట్‌గా నడవాల్సిన బాధ్యత ప్రశాంత్‌ నీల్‌దే. తారక్‌తో నీల్‌ తెరకెక్కిస్తున్న సినిమాను ఇంటర్నేషనల్‌ లెవల్లో రిలీజ్‌ చేస్తామని చెప్పారు మైత్రీ రవి. అప్పట్లో ట్రిపుల్‌ ఆర్‌ని, కేజీయఫ్‌ ఫాలో అయితే, ఇప్పుడు వారణాసిని ఫాలో అవుతూనే క్రాస్‌ చేయాల్సిన బాధ్యత ఎన్టీఆర్‌ – నీల్‌ మూవీ మీద ఉంది. మీరందరూ ఇప్పుడు ప్యాన్‌ ఇండియా స్టార్లు.. అసలు ఆ పదానికి పేటెంట్‌ నాది అంటున్న ప్రభాస్‌ కూడా త్వరలోనే రాజా సాబ్‌ రిలీజ్‌ రేసులో ఉన్నారు. లాస్ట్ ఇయర్‌ పుష్ప2 ఈవెంట్‌, ఈ ఏడాది వారణాసి ఈవెంట్‌.. వీటన్నిటినీ చూశాక డార్లింగ్‌ కాంపౌండ్‌ ప్రమోషన్లను ఎలా ప్లాన్‌ చేస్తుందోననే క్యూరియాసిటీ రెబల్‌ ఫ్యాన్స్ లో గట్టిగానే కనిపిస్తోంది. ఒకరిని మించి మరొకరు అన్నట్టు.. ఇంటర్నేషనల్‌ ఆడియన్స్ కి నయా ప్రమోషనల్‌ రూట్స్ ని పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నారు టాలీవుడ్‌ మేకర్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి.. క్యాబ్ డ్రైవర్ రూల్స్ వైరల్

ఆరు శతాబ్దాల మహావృక్షం చరిత్ర.. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం

ఫోన్‌‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు

తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి

Andhra Pradesh: ఏపీలో స్మార్ట్‌ కార్డ్‌.. ఆధార్‌ను మించి..