TOP 9 ET: గుంటూరోడి గ్రేట్ రికార్డ్.. | మొదలైన యంగ్ హీరో శర్వా పెళ్లి సందడి.. వీడియో రిలీజ్.
టాలీవుడ్‌లో మరో హీరో పెళ్లి పీటలెక్కుతున్నాడు. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న హీరో శర్వానంద్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. జూన్ 3న పెళ్లి వేడుక జరగనుంది. దీనికి ఒక్కరోజు ముందే పెళ్లి సందడి షురూ అయిపోయింది. వధూవరులతో సహా కుటుంబ సభ్యులు ఇప్పటికే జైపూర్ చేరుకున్నారు.
01.Rana
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి, మలయాళ టాప్ స్టార్ దుల్కర్ సల్మాన్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాను స్పిరిట్ మీడియా బ్యానర్‌లో రానా స్వయంగా నిర్మిస్తున్నారు. బైలింగ్యువల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 6న రామానాయుడు జయంతి సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ రానుంది.
02.BRO
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని తెరకెక్కిస్తున్న సినిమా బ్రో. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది. పవన్ పోర్షన్ పూర్తి కాగా.. తేజ్ వర్షన్ కూడా చివరికి వచ్చేసింది. ఇదిలా ఉంటే బ్రో షూటింగ్‌కు సంబంధించిన మేజర్ అప్‌డేట్ బయటికొచ్చిందిప్పుడు. జూన్ 5 నుంచి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ పాట చిత్రీకరణ జరగనుంది. ఇందులో పవన్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ పాల్గొనబోతున్నారు. సినిమా జులై 28న రిలీజ్ కానుంది.
03.Saithan
రీసెంట్‌గా సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్‌తో మంచి సక్సెస్ అందుకున్న మహి వీ రాఘవ నుంచి వస్తున్న మరో డిజిటల్ ప్రాజెక్ట్ సైతాన్. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందించిన ఈ వెబ్ సిరీస్ విషయంలో ముందు నుంచి ఆడియన్స్‌ను ప్రీపేర్ చేస్తున్నారు మేకర్స్. ఈ సిరీస్‌లో వైలెన్స్, బోల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువగా ఉంటుందన్న మేకర్స్, షో చూసేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
04.LGM
లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని సమర్పణలో ఆయన భార్య సాక్షి ధోని నిర్మిస్తున్న తొలి చిత్రం లెట్స్ గెట్ మ్యారీడ్. హరీష్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నదియా, యువనా, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో రమేష్ తమిళమణి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆల్రెడీ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్.
05.Spider Man
స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో మరో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. స్పైడర్ మ్యాన్ 4గా రూపొందుతున్న ఈ సినిమాలో పీటర్ పార్కర్ పాత్రలో టామ్, ఎంజేగా జెండయా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా… రైటర్స్ గిల్డ్ అసోసియేషన్ సమ్మె వల్ల నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఇటీవల రైటర్స్ సమ్మె విరమించటంతో త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
06. BoyapatiRapo
మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను. తాజాగా రామ్ సినిమా కూడా అలాగే ఉండబోతుందని టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. తాజాగా ఈ సినిమా గురించి మేజర్ అప్‌డేట్ ఇచ్చారు రామ్. యాక్షన్ సీన్ కోసం దాదాపు 24 రోజులు కష్టపడ్డానని తెలిపారు. మొత్తానికి క్లైమాక్స్ పూర్తైందని కన్ఫర్మ్ చేసారు. ఇది క్లైమాక్స్ కాదు.. మ్యాక్స్ అంటూ ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. దీన్నిబట్టే క్లైమాక్స్ సీక్వెన్స్ ఎంత భారీగా ఉండబోతుందో అర్థమవుతుంది. సినిమా అక్టోబర్ 20న విడుదల కానుంది.
07.Samantha
షూటింగ్‌తో ఎంత బిజీగా ఉన్నా.. ఫిట్నెస్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు సమంత. ప్రతిరోజూ వ్యాయామాన్ని మాత్రం పక్కనబెట్టరు. ఎక్కడున్నా జిమ్‌లో కసరత్తులు మాత్రం కంపల్సరీ. ఎప్పటికప్పుడు తన వ్యాయామానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు సమంత. తాజాగా మరోసారి ఇదే చేసారు. చాలా కఠినమైన వ్యాయామాలు చేస్తున్నారు స్యామ్. అందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది. అందులో కండలతో కనిపిస్తున్నారు సమంత.
08.Sharwanand
టాలీవుడ్‌లో మరో హీరో పెళ్లి పీటలెక్కుతున్నాడు. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న హీరో శర్వానంద్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. జూన్ 3న పెళ్లి వేడుక జరగనుంది. దీనికి ఒక్కరోజు ముందే పెళ్లి సందడి షురూ అయిపోయింది. వధూవరులతో సహా కుటుంబ సభ్యులు ఇప్పటికే జైపూర్ చేరుకున్నారు. శర్వానంద్, రక్షిత వివాహం జైపూర్ లీలా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. అక్కడే రెండు రోజుల పాటు పెళ్లి సందడి ఉండనుంది. ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
09. Mahesh
అందరూ అనుకున్నట్టే.. నెట్టింట మహేష్ ఫ్యాన్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నట్టే గుంటూరు కారంగా వచ్చిన మహేష్ బాబు ఆల్ టైం రికార్డును క్రియేట్ చేశారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో.. తాను చేస్తున్న మూవీ టైటిల్ గ్లింప్స్‌తోనే.. 25 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకున్నారు మన సూపర్ స్టార్. ఇక జెస్ట్ 24 గంటల్లోనే .. వన్ మినెట్ ఫైవ్ సెకండ్స్ టీజర్‌తో.. యూట్యూబ్‌లో 25 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకున్న మహేష్ ఇప్పుడు త్రూ అవుట్ సోషల్ మీడియా నెంబర్ 1గా ట్రెండ్ అవుతున్నారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను కాలర్ ఎగరేసేలా చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.