TOP 9 ET: నేషనల్ అవార్డ్స్‌పై సందీప్ వంగా షాకింగ్ కామెంట్స్ | ఓటు వేయడం కోసం క్యూలో సెలబ్రిటీలు.
నేషనల్ అవార్డ్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..! అల్లు అర్జున్‌కు 69వ నేషనల్ అవార్డ్ రావడం సంతోషమే కానీ.. 69 ఏళ్లుగా మన వాళ్లకు ఎందుకు ఈ అవార్డ్ రాలేదా అని.. తనకు అనిపిస్తుంటుందని వంగా అన్నారు. అంతేకాదు అసలు మన వాళ్లు అప్లై చేశారా? లేక మన వాళ్లు నేషనల్ అవార్డ్స్‌ను సీరియస్‌గా తీసుకోలేదేమో అన్నట్లు మాట్లాడారు.
01.sandeep
నేషనల్ అవార్డ్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..! అల్లు అర్జున్‌కు 69వ నేషనల్ అవార్డ్ రావడం సంతోషమే కానీ.. 69 ఏళ్లుగా మన వాళ్లకు ఎందుకు ఈ అవార్డ్ రాలేదా అని.. తనకు అనిపిస్తుంటుందని వంగా అన్నారు. అంతేకాదు అసలు మన వాళ్లు అప్లై చేశారా? లేక మన వాళ్లు నేషనల్ అవార్డ్స్‌ను సీరియస్‌గా తీసుకోలేదేమో అన్నట్లు మాట్లాడారు.
02. Vote
నిన్న మొన్నటి వరకు షూటింగ్స్‌తో తెగ బిజీగా ఉన్న స్టార్ హీరోలందరూ.. తమ ఓటు క్యాస్ట్ చేసుకునేందు ఉదయాన్నే వారికి కేటాయించిన పోలింగ్ బూత్‌లకు వెళ్లారు. చాలా ఓపికగా క్యూలో నిలబడి మరీ..తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. అంతే కాదు తమ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
03.Hi Nanna
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శ్రుతి హాసన్ మరో కీలక పాత్రలో నటించారు. శౌర్యువ్ దర్శకుడు.
04.War 2
వార్ 2 సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2025 ఇండిపెండెన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు మేకర్స్. స్పై యూనివర్స్‌లో 6వ సినిమాగా రూపొందుతున్న వార్ 2కు అయాన్ ముఖర్జీ దర్శకుడు.
05.Double Ismart
ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రామ్, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న మరో మూవీ డబుల్ ఇస్మార్ట్. ప్రస్థుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా మరో 100 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కౌంట్ డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో సంజయ్ దత్‌లో కీలక పాత్రలో నటిస్తున్నారు.
06.Rules Ranjan
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ రూల్స్ రంజన్. థియేట్రికల్ రిలీజ్‌లో మంచి విజయం సాధించిన ఈ సినిమా నవంబర్ 30న ఆహాలో స్ట్రీమ్ కానుంది. గురువారం సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్‌కు అందుబాటులోకి రానుందని వెల్లడించింది ఆహా.
07.Main Atal Hoon
అటల్ బిహారీ వాజ్‌పాయి జీవితం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘మై అటల్ హూ’. విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠి టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమా 2024 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజ్ డేట్‌తో పాటు వాజ్‌పాయిగా పంకజ్ లుక్‌ను కూడా రివీల్ చేసింది చిత్రయూనిట్.
08.Varuntej
వరుణ్‌తేజ్ హీరోగా, పలాస ఫేమ్ కరుణకుమార్ డైరక్ట్ చేస్తున్న సినిమా మట్కా. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ని డిసెంబర్ నుంచి మొదలుపెట్టనున్నారు. ప్రీ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ జరుగుతున్నాయి. 1958-1982 మధ్య జరిగే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
09. VIJAY SETHUPATHI
విజయ్ సేతుపతి హీరోగా మిస్కిన్ డైరక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ట్రైన్ ట్రావెల్ నేపథ్యంలో సినిమా ఉంటుందట. ట్రైన్ అనే టైటిల్ పెట్టాలనుకుంటోంది యూనిట్. ఇకపై విలన్‌గా నటించనని, హీరోగా మాత్రమే కంటిన్యూ అవుతానని అన్నారు విజయ్ సేతుపతి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.