TOP 9 ET: ఎవ్వరూ అందుకోలేని రికార్డ్‌ ఇది..! | సినిమా నుంచి శ్రీలీల అవుట్.!

|

Oct 28, 2023 | 9:54 PM

పాన్ ఇండియ స్టార్ గా మారింది మొదలు.. తన సినిమాల ప్రీరిలీజ్ బిజినెస్‌లతో.. అంతటా హాట్ టాపిక్ అవుతున్న ప్రభాస్.. సలార్‌తోనూ మరో సారి అదే చేశారు. డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు టూ స్టేట్స్‌లో.. దాదాపు 175కోట్ల బిజినెస్ చేసిందనే టాక్‌తో.. ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్అ అవుతున్నారు. ప్రభాస్‌ను ఆయన ప్రీ రిలీజ్‌ బిజినెస్ నెంబర్స్‌ను ఎవరూ అందుకోలేరనే కామెంట్ కూడా.. ఇన్స్టెంట్‌గా వచ్చేలా చేసుకుంటున్నారు మన రెబల్ స్టార్.

01.Prabhas
పాన్ ఇండియ స్టార్ గా మారింది మొదలు.. తన సినిమాల ప్రీరిలీజ్ బిజినెస్‌లతో.. అంతటా హాట్ టాపిక్ అవుతున్న ప్రభాస్.. సలార్‌తోనూ మరో సారి అదే చేశారు. డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు టూ స్టేట్స్‌లో.. దాదాపు 175కోట్ల బిజినెస్ చేసిందనే టాక్‌తో.. ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్అ అవుతున్నారు. ప్రభాస్‌ను ఆయన ప్రీ రిలీజ్‌ బిజినెస్ నెంబర్స్‌ను ఎవరూ అందుకోలేరనే కామెంట్ కూడా.. ఇన్స్టెంట్‌గా వచ్చేలా చేసుకుంటున్నారు మన రెబల్ స్టార్.

02. Khaidi
చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఖైదీ. ఈ సినిమా విడుదలై నేటికి 40 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఖైదీ సినిమాతో తన జ్ఞాపకాలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు చిరంజీవి. ఇంత గొప్ప విజయాన్ని తమకు అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించారు.

03.Sreeleela
అరడజన్ పైగా సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల.. అన్ని సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడంలో విఫలమవుతున్నారు. అందుకే కొన్ని సినిమాలు ఇష్టం లేకపోయినా వదులుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నారని తెలుస్తోంది. ఈమె స్థానంలోకి ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య రాబోతున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది.

04. Pawan Kalyan
నవంబర్ 1న ఇటలీలో జరగనున్న వరుణ్ తేజ్ పెళ్లి కోసం పవన్ కళ్యాణ్ సతీసమేతంగా అక్కడికి వెళ్లారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్‌లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 30 నుంచి వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయి. సంగీత్, ప్రీ వెడ్డింగ్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మెగా హీరోలు అక్టోబర్ చివరి వారం షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చారు.

05.Balakrishna
అఖండ సినిమా నుంచి గడ్డంతోనే కనిపిస్తున్న బాలయ్య ఇటీవల భగవంత్ కేసరి సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో క్లీన్‌ షేవ్‌తో కనిపించారు. ఈ న్యూ లుక్ నెక్ట్స్ సినిమా కోసమే అన్న టాక్ వినిపిస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్బీకే 109లో బాలయ్య రెండు డిఫరెంట్ రోల్స్‌లో కనపించబోతున్నారు.

06.AHA
రీ రిలీజ్‌ ట్రెండ్‌ను డిజిటల్‌కు కూడా తీసుకువచ్చింది ఆహా. తెలుగు సినిమా హిస్టరీలో క్లాసిక్స్‌గా నిలిచిన సినిమాలను బెస్ట్ క్వాలిటీలో డిజిటల్‌లో రీ రిలీజ్‌ చేయనుంది. నవంబర్ 3న మగధీర, 10న అతడు, 17న ఘరానా మొగుడు సినిమాల రీమాస్టర్‌ వర్షన్స్‌ ఆహాలో స్ట్రీమ్ కానున్నాయి.

07. Keeda Cola
తరుణ్ భాస్కర్ నటిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా కీడా కోలా. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సినిమా నవంబర్ 3న విడుదల కానుంది. చైతన్య రావు, బ్రహ్మానందం, జీవన్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఓవర్సీస్‌లో 400 స్క్రీన్స్‌లో నవంబర్ 2న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు.

08.Skanda
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన యాక్షన్ డ్రామా చిత్రం స్కంద. ఈ చిత్రంలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన స్కంద థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేదు. తాజాగా ఈ చిత్ర ఓటిటి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. నవంబర్ 2న ప్రముఖ ఓటిటిలో స్ట్రీమ్ కానుంది స్కంద.

09.Vikram
హీరో విక్రమ్ వరుస సినిమాలు ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ సినిమా చేస్తున్న ఈయన.. ధ్రువ నక్షత్రం సినిమాను దివాళికి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ సినిమా ఆరేళ్లుగా వాయిదా పడుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ మధ్యే సిద్ధార్థ్‌తో చిన్నా సినిమా తెరకెక్కించిన అరుణ్ కుమార్ దర్శకత్వంలో విక్రమ్ ఒక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..