TOP 9 ET: గ్రాండ్ వెల్‌కమ్‌..ఏమాత్రం తగ్గని ఫ్యాన్స్ | బుజ్జి క్లిన్‌కారాతో.. చెర్రీ ఇటలీ ట్రిప్.

|

Oct 18, 2023 | 9:22 PM

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలోని మొదటి పాట కోసం అభిమానులు చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. తాజాగా దీనిపై గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాత నాగవంశీ. దసరాకు పాట గురించి అప్‌డేట్ ఇస్తామన్నారాయన. డేట్ అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే పాట కూడా వస్తుందని క్లారిటీ ఇచ్చారు. డిజే టిల్లుతో మార్కెట్ క్రియేట్ చేసుకున్న సిద్ధూ జొన్నలగడ్డ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు.

1. Ram Charan: ఇటలీ ట్రిప్..
నిన్నమొన్నటి వరకు గేమ్ ఛేంజర్ షూటింగ్‌తో బిజీగా ఉన్న రామ్ చరణ్ తాజాగా మరో ఫారిన్ ట్రిప్ వెళ్లారు. ఈ ట్రిప్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది తన ముద్దుల తనయక్లిన్‌కారాకు తొలి ఫారిన్ ట్రిప్. ఎయిర్ పోర్టులో కూతురుతో చరణ్ వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ చేతుల్లో వాళ్ల పెట్ డాగ్ రైమ్, ఉపాసన ఒడిలో క్లీంకార ఉన్నారు.

2. Allu Arjun
నేషనల్ అవార్డ్‌ అందుకుని.. హైద్రాబాద్‌కు వచ్చిన అల్లు అర్జున్‌కు గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌. డీజేలతో.. బాంబుల.. అల్లు అర్జున్ ఉండే కాలినీని హోరెత్తించారు. అల్లు అర్జున్‌కు జేజేలు కొడుతూ.. హంగామా చేశారు.

03. Bhagavanth Kesari
అఖండ, వీరసింహారెడ్డి లాంటి విజయాలతో జోరు మీదున్నారు బాలయ్య. దసరా దండయాత్రకు వచ్చేస్తున్న సినిమాల్లో భగవంత్ కేసరి ముందుంది. తాజాగా ఈ చిత్ర రోర్ ఆఫ్ కేసరి సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటకు పవర్ ఫుల్ ట్యూన్ ఇచ్చారు థమన్. బాలయ్య 2023లోనే రెండోసారి యుద్ధానికి వచ్చేస్తున్నారు.. అక్టోబర్ 19న విడుదల కానుంది భగవంత్ కేసరి.

04.Mahesh Babu
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలోని మొదటి పాట కోసం అభిమానులు చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. తాజాగా దీనిపై గుడ్ న్యూస్ చెప్పారు నిర్మాత నాగవంశీ. దసరాకు పాట గురించి అప్‌డేట్ ఇస్తామన్నారాయన. డేట్ అనౌన్స్ చేసిన కొన్ని రోజులకే పాట కూడా వస్తుందని క్లారిటీ ఇచ్చారు.

05. Tiger Nageswara Rao
టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి సెన్సార్ పూర్తైంది. దీనికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అలాగే ఈ చిత్రం 3 గంటలకు పైగా నిడివితో వస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న వేళ.. అది నిజం కాదని ఇప్పుడు తేలిపోయింది. టైగర్ నాగేశ్వరరావు ఫైనల్ రన్ టైమ్ 2 గంటల 52 నిమిషాలు. పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమా అక్టోబర్ 20న విడుదల కానుంది.

06. Leo
సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం లియో ఫీవర్ నడుస్తుంది. ఈ చిత్ర ప్రీ బుకింగ్స్ చూస్తుంటే బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయం అని తెలుస్తుంది. ముఖ్యంగా జైలర్ రికార్డులను సైతం ఈజీగానే క్రాస్ చేసేలా కనిపిస్తుంది లియో. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే 30 కోట్లు దాటిపోయింది. మరోవైపు తమిళం కంటే తెలుగులోనే షోస్ ముందు పడుతున్నాయి. లియో టైటిల్‌పై ఉన్న వివాదం కూడా సమసిపోయింది.

07. Telusu Kada
డిజే టిల్లుతో మార్కెట్ క్రియేట్ చేసుకున్న సిద్ధూ జొన్నలగడ్డ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన టిల్లు స్క్వేర్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే తాజాగా తెలుగు కదా సినిమాను మొదలు పెట్టారు సిద్ధూ. కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా, లిరిక్ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి.

08.Japan
కార్తీ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జపాన్‌. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు మేకర్స్‌. తాజాగా కార్తీ క్యారెక్టర్‌కు సంబంధించి మరో పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కార్తికి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌ నటించారు.

09.Singham
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ యాక్షన్‌ సిరీస్‌ సింగం ఫ్రాంచైజీలో మరో మూవీ రెడీ అవుతోంది. సింగం ఎగైన్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఆరు ఎకరాల్లో వేసిన భారీ సెట్‌లో అజయ్‌ దేవగన్‌, అక్షయ్‌ కుమార్‌, రణ్‌వీర్ సింగ్‌, టైగర్‌ ష్రాఫ్‌, కరీనా కపూర్‌పై యాక్షన్‌ సీన్‌ చిత్రీకరిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..