TOP 9 ET: మెగా వార్నింగ్.. | దిమ్మతిరిగే న్యూస్.. లియోలో రామ్ చరణ్.. వీడియో.
రణ్‌బీర్ కపూర్, సందీప్ వంగా కాంబినేషన్‌లో వస్తున్న యానిమల్ సినిమా ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అమ్మాయి అంటూ సాగే మెలోడియస్ సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా ఈ పాటలో సీన్‌ను రిప్రజెంట్ చేశారు. రణ్‌బీర్‌తో పెళ్లి వద్దు అంటూ రష్మిక ఫ్యామిలీ మెంబర్స్ వాదిస్తుండగా.. రష్మిక మాత్రం తనే కావాలంటూ ముద్దుతో క్లారిటీ ఇవ్వడం.. ఆ తర్వాత వీళ్లు పెళ్లిచేసుకోవడం ఇలా పాటలో సీన్‌ను చూపించారు.
01.Ram Charan
అక్టోబర్ 19న తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్‌లో.. వరల్డ్ వైడ్ లియో ఫిల్మ్ రిలీజ్ అవుతున్న వేళ.. ఈసినిమాలో చెర్రీ నటిస్తున్నాడనడానికి ఓ ఆధారం దొరికింది ఫ్యాన్స్‌కు. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయిన ఈ సినిమా టికెట్స్.. కాస్టింగ్ కాలమ్‌లో రామ్ చరణ్ పేరు ఉంది. టికెట్ల మీదే కాదు.. ఓవర్సీస్‌లో ఉన్న కొన్ని ఫిల్మ్ వెబ్ సైట్లలో కూడా.. దళపతి విజయ్‌తో పాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు కూడా లియో కాస్టింగ్ లిస్ట్‌లో ఉంది. ఇక ఇది పట్టుకున్న మెగా పవర్ స్టార్ అభిమానులు.. ఈసినిమా చరణ్ కీ రోల్ చేస్తున్నారంటూ.. ఫిక్స్ అయిపోయారు. విక్రమ్ సినిమాలో రోలెక్స్‌లాగే.. చెర్రీ దిమ్మతిరిగే ఎంట్రీ ఈ సినిమాలో ఉంటుందటూ.. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు తెగ ఖుషీ అవుతున్నారు.
02.Game Changer
నిన్న మొన్నటి వరకు ఇండియన్2 డబ్బింగ్ వర్క్‌లో బిజీగా ఉన్న శంకర్, ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా గేమ్ చేంజర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్‌లో రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు.
03.Leo
లియో ట్రైలర్‌ను ప్రదర్శించిన థియేటర్లకు సెన్సార్ బోర్డ్ లీగల్ నోటీసులు ఇచ్చింది. అభ్యంతరకర పదాలతో ఉన్న ట్రైలర్‌ను ప్రదర్శించినందుకు ఈ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ట్రైలర్ విషయంలో వస్తున్న విమర్శలపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు. కథ పరంగానే అలాంటి డైలాగ్ వాడాల్సి వచ్చిందంటూ క్లారిటీ ఇచ్చారు.
04.Jagadeka
1990లో రిలీజ్ అయిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి. ఇటీవల ఈ సినిమా లైన్స్‌లో మరో మూవీ తెరకెక్కుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ స్పందించారు. సినిమాకు సంబంధించిన పూర్తి హక్కులు తమ దగ్గరే ఉన్నాయని, ఎవరైనా ఆ కాన్పెప్ట్‌ను వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ నోట్ రిలీజ్ చేశారు.
05. Animal
రణ్‌బీర్ కపూర్, సందీప్ వంగా కాంబినేషన్‌లో వస్తున్న యానిమల్ సినిమా ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అమ్మాయి అంటూ సాగే మెలోడియస్ సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా ఈ పాటలో సీన్‌ను రిప్రజెంట్ చేశారు. రణ్‌బీర్‌తో పెళ్లి వద్దు అంటూ రష్మిక ఫ్యామిలీ మెంబర్స్ వాదిస్తుండగా.. రష్మిక మాత్రం తనే కావాలంటూ ముద్దుతో క్లారిటీ ఇవ్వడం.. ఆ తర్వాత వీళ్లు పెళ్లిచేసుకోవడం ఇలా పాటలో సీన్‌ను చూపించారు.
06.Adikesava
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఆదికేశవ. శ్రీ లీల ఇందులో హీరోయిన్. నవంబర్ 10, 2023న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇందులోంచి రెండో సింగిల్ విడుదలైంది. హే బుజ్జి బంగారం అంటూ సాగే ఈ పాటకు జీవి ప్రకాశ్ కుమార్ ట్యూన్స్ ఇచ్చారు.
07. RGV
రామ్ గోపాల్ వర్మ వరసగా పొలిటికల్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈయన నుంచి ఎన్నో రాజకీయ సినిమాలు వచ్చాయి. తాజాగా వ్యూహం అంటూ మరో సినిమా చేస్తున్నారు వర్మ. ఇది నవంబర్ 10న విడుదల కానుంది. అలాగే శపథం పేరుతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారీయన. ఇది వ్యూహం సినిమాకు సీక్వెల్. దీన్ని జనవరి 25న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్
08.Aamir Khan
బాలీవుడ్ సీనియర్ హీరో ఆమిర్ ఖాన్ తన నెక్ట్స్ మూవీపై క్లారిటీ ఇచ్చారు. సితారే జమీన్ పర్ పేరుతో ఓ ఎమోషనల్ డ్రామాలో నటించేందుకు రెడీ అవుతున్నట్టుగా వెల్లడించారు. గతంలో తారే జమీన్ పర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆమిర్ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా జనవరిలో ప్రారంభం కానుంది.
09.Tiger
టైగర్ 3 సినిమా నుంచి కత్రినా కైఫ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో తొలి ఫీమేల్ స్పై అంటూ కత్రినా యాక్షన్ లుక్‌ను రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టైగర్ 3 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ కూడా గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..