TOP 9 ET: బాలీవుడ్‌ను దున్నేస్తున్న NTR, చెర్రీ | మొదలవుతోన్న NTR, ప్రశాంత్ నీల్ ఫిల్మ్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌ను దున్నేస్తున్నారు. అక్కడి స్టార్ హీరోలను మించి క్రేజీ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే యంగ్ టైగర్ వార్ 2 సినిమాకు ఓకే చెప్పగా.. త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రాజ్ కుమార్ హిరాణీ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో.. #NN వర్కింగ్ టైటిల్‌తో అనౌన్స్ అయిన సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ బయటికి వచ్చింది.
01.Bollywood
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌ను దున్నేస్తున్నారు. అక్కడి స్టార్ హీరోలను మించి క్రేజీ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే యంగ్ టైగర్ వార్ 2 సినిమాకు ఓకే చెప్పగా.. త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రాజ్ కుమార్ హిరాణీ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారు.
02.#NN
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో.. #NN వర్కింగ్ టైటిల్‌తో అనౌన్స్ అయిన సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఇప్పటికే మోస్ట్ అవేటెడ్ మూవీగా నామ్ కమాయించిన ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు.. ఏప్రిల్ 15 నుంచి మొదులకానున్నట్టు.. మేకర్స్ నుంచి అఫీషియల్ ట్వీట్ వచ్చింది.
03.Devara
దేవర సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. షూటింగ్ సమయంలో కథను మరింత డిటైల్‌గా చెప్పే అవకాశం ఉందని భావించిన యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు.
04. Saindhav
వెంకటేష్ కూడా సంక్రాంతి రేసులో జాయిన్ అయ్యారు. ఇప్పటికే మహేష్, రవితేజ, నాగార్జున రేసులో ఉన్నారు. 2024 సంక్రాంతికి సైంధవ్‌తో రానున్నారు వెంకటేష్. జనవరి 13న ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇది వెంకటేష్‌కు 75వ సినిమా కావడం గమనార్హం. హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకుడు.
05.Tiger
రవితేజ హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమా ట్రైలర్‌ను బధిరుల కోసం సైన్ లాంగ్వేజ్‌లో లాంచ్ చేశారు మేకర్స్. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమా రికార్డ్ సృష్టించింది టైగర్ నాగేశ్వరరావు.
06.Pooja Hegde
బుట్టబొమ్మ పూజా హెగ్డే గాయపడ్డారు. తన మోకాళ్లకు గాయం అయ్యిందంటూ ఓ ఫోటోను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు పూజ. ప్రస్తుతం షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న కోయిషక్ సినిమాలో నటిస్తున్నారు పూజా. ఈ సినిమా కోసం స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తుండగా పూజా గాయపడ్డారు.
07.Ajith
ఫైనల్‌గా నెక్ట్స్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. విడాముయర్చి పేరుతో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అజర్‌బైజాన్‌లో ప్రారంభమైంది. తొలి షెడ్యూల్‌లో అజిత్‌తో పాటు త్రిష మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మగిల్ తిరుమేణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
08.Ambajipeta Marraige band:
కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాల తర్వాత సుహాస్ నటిస్తున్న సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. దుశ్యంత్ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంఛ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అక్టోబర్ 9న టీజర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు.
09.MAD
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత రాధాకృష్ణ కుమార్తె హారిక నిర్మాణంలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా మ్యాడ్. కళ్యాణ్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక JRC కన్వెన్షన్ హాల్‌లో జరిగింది. దీనికి దుల్కర్ సల్మాన్ ముఖ్య అతిథిగా వచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..