TOP 9 ET: దేవర టికెట్ బుకింగ్స్‌లో గడబిడ | NTR రూ.100 కోట్ల పట్టుదల..

|

Sep 25, 2024 | 11:35 AM

దేవర టికెట్ బుకింగ్ కోసం బుక్‌ మై షో ను ఆశ్రయిస్తున్న వారికి బిగ్ షాక్ తగులుతోంది. కొన్ని థియేటర్స్‌లో దేవర టికెట్స్ ఉన్నట్టు చూపిస్తున్నా.. బుకింగ్ లో ఎర్రర్ కోడ్ వస్తోంది. దీంతో దేవర ఫ్యాన్స్‌లో కోపం కట్టులు తెచ్చుకుంటోంది. ఈ ఆన్‌ లైన్ టికెటింగ్‌ ఆప్‌ పై నెట్టింట విమర్శలు వచ్చేలా చేస్తోంది. ఎన్టీఆర్ పట్టుదల మీదున్నారట. ఈసారి ఎలాగైనా.. సోలోగా.. 100 కోట్ల రూపాయిల ఓపెనింగ్స్‌ను కొల్లగొట్లాలని చూస్తున్నారట.

01.Devara: దేవర టికెట్ బుకింగ్స్‌లో గడబిడ

దేవర టికెట్ బుకింగ్ కోసం బుక్‌ మై షో ను ఆశ్రయిస్తున్న వారికి బిగ్ షాక్ తగులుతోంది. కొన్ని థియేటర్స్‌లో దేవర టికెట్స్ ఉన్నట్టు చూపిస్తున్నా.. బుకింగ్ లో ఎర్రర్ కోడ్ వస్తోంది. దీంతో దేవర ఫ్యాన్స్‌లో కోపం కట్టులు తెచ్చుకుంటోంది. ఈ ఆన్‌ లైన్ టికెటింగ్‌ ఆప్‌ పై నెట్టింట విమర్శలు వచ్చేలా చేస్తోంది.

02.Devara: NTR రూ.100 కోట్ల పట్టుదల.!

ఎన్టీఆర్ పట్టుదల మీదున్నారట. ఈసారి ఎలాగైనా.. సోలోగా.. 100 కోట్ల రూపాయిల ఓపెనింగ్స్‌ను కొల్లగొట్లాలని చూస్తున్నారట. ఇక దేవర పై ఇప్పటికే ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌.. దానికితోడు ఏపీ , తెలంగాణ ప్రభుత్వాలు.. టికెట్‌ రేట్‌ పై.. అదనపు షోలపై ఇచ్చిన పర్మిషన్‌! వెరసి ఇవన్నీ చూస్తుంటే.. ఈ సినిమా డే1 వరల్డ్ వైడ్ 100 కోట్లు కలెక్షన్స్‌ వసూలు చేయడం పక్కా అనే కామెంట్ కూడా.. తారక్‌ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది.

03.NTR: NTR చెప్పడంతోనే ఆలియా కూతురికి ఆ పేరు.

రణ్బీర్, ఆలియా కపూర్ కూతురు పేరు రాహా అని అందరికీ తెలుసు! అయితే ఆ పేరు ఎవరు సజెస్ట్ చేశారనేది మాత్రం తెలీదు. అయితే ఆ సీక్రెట్ ఇప్పుడు బయటికి వచ్చింది. తన కూతురుకి రాహా పేరు సజెస్ట్ చేసింది యంగ్ టైగర్ ఎన్టీఆరేనని ఆలియా చెప్పింది. బ్రహ్మాస్త ప్రమోషన్ టైంలో.. ఎన్టీఆర్‌ తన ఇంటికి డిన్నర్ కి పిలిచాడని.. అప్పుడు తాను 9 నెలల గర్భవతినని.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఆలియా.. అప్పుడు తనకు కూతురు పుడితే.. రాహా పేరు పెట్టాలని తారక్ కోరినట్టు చెప్పింది.

04.koratala: మెగాస్టార్‌తో విభేదాల పై క్లారిటీ ఇచ్చిన కొరటాల.!

మెగాస్టార్ చిరుతో విభేదాలంటూ.. కొరటాల శివపై గత కొన్ని రోజులుగా నెట్టింట ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఆ న్యూస్‌ తప్పని.. జస్ట్ అది రూమర్ అని క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. ఆచార్య ఫ్లాప్ అయినప్పడు.. తనకు ఫస్ట్ మెసేజ్‌ చేసింది చిరునే అన్నారు. అనవసరంగా ఓ ఇంటర్వ్యూలోని ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. తమ మధ్య ఇప్పటికీ మంచి అనుబంధం ఉందని.. రీసెంట్గా జరిగిన దేవర ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పారు కొరటాల.

05. pawan: నేను చెప్పింది ఏంటి? మీరు తిప్పుతున్నదేంటి.? పవన్‌కు ప్రకాశ్ కౌంటర్ వీడియో..

లడ్డూ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఈ విషయంలో ఎవరూ నెగెటివ్‌గా రియాక్టైనా.. వారిపై సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే కార్తీ ఫన్నీ కామెంట్‌పై అసహనం వ్యక్తం చేసిన పవన్‌.. తాజాగా ప్రకాశ్‌ రాజ్‌ పై కూడా ఫైర్ అయ్యారు. ఇక ఈక్రమంలోనే ప్రకాశ్‌ కూడా.. పవన్‌ మాటలపై ఓ కౌంటర్ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఆ వీడియోలో.. పవన్‌ కళ్యాణ్ ప్రెస్‌ మీట్‌ను ఇప్పుడే చూశానని చెప్పిన ప్రకాశ్‌ రాజ్‌.. తాను చెప్పింది కాకుండా.. పవన్‌ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. తాను విదేశాల్లో ఉన్నానని.. వచ్చాక తన ట్వీట్‌ కు అర్థం ఏంటో చెబుతా అన్నారు. ఈలోపు టైం ఉంటే.. మరో సారి తన ట్వీట్ చదవాలంటూ పవన్‌ ను సెటైరికల్‌గా రిక్వెస్ట్ చేశారు ప్రకాశ్‌ రాజ్‌.

06.ram charan: వచ్చేస్తున్నాడు.!

దేవర వచ్చేశాడు. బాక్సాఫీస్ దగ్గర చెడుగుడు ఆడేస్తున్నాడు. కలెక్షన్స్‌లో నయా రికార్డులు క్రియేట్ చేసేలానే ఉన్నాడు. ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ను ఫాలో అవుతూ మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ కూడా వచ్చేస్తున్నారు. తన కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ను సాటిస్ ఫై చేసేలా.. తన గేమ్‌ ఛేంజర్ సినిమాలోని సెకండ్‌ సింగిల్ అప్డేట్‌ను రిలీజ్‌ చేయనున్నాడు. సెప్టెంబర్ 27, దేవర రిలీజ్‌ రోజే.. తన ఫ్యాన్స్‌కు ధమాఖా లాంటి ఫీల్‌ నిచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఆ తర్వాత నుంచి తన ఫ్యాన్స్‌ ఉక్కిరి బిక్కిరి చేసేలా.. సర్‌ప్రైజెస్‌ ప్లాన్ చేస్తున్నాడట చరణ్‌.

07. surya: ఇలా తప్పులు వెతికితే కష్టం సూర్య సీరియస్ రియాక్షన్.

అది సెటైర్‌ అయినా… కామెంట్ అయినా కూల్గా విసిరే సూర్య మరో సారి అదే చేశారు. తన తమ్ముడు కార్తీ సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. రివ్యూవర్లపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. సినిమాను సినిమాలా చూసి ఎంజాయ్‌ చేయాలని.. అలా కాకుండా.. తప్పులు వెతికేందుకో.. బాక్సాఫీస్‌ కలక్షన్ల దృష్టితోనో చూస్తే ఎంజాయ్‌ చేయలేరంటూ చెప్పారు. ఇక తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవున్నారు ఈ రోలెక్స్‌

08.sandeep kishan: సక్సెస్ కోసం పేరు మార్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో..

సక్సెస్ కోసం హీరోలు నానా పాట్లు పడుతుంటారు. ఏదో రకంగా సక్సెస్ తమ దరిచేరితే చాలనుకుంటారు. అలా అనుకున్నారో ఏమో కానీ.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో సందీప్‌ కిషన్ ఏకంగా తన పేరు మార్చుకున్నాడు. న్యూమరాలజీ ప్రకారం Sundeep kishan పేరులోని కిషన్‌లో a లెటర్ తీసేశాడు. అంతేకాకుండా పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ కూడా పెట్టుకున్నాడు. మరి ఇలా అయినా ఈ హీరో సక్సెస్‌ పడతాడో లేదో చూడాలి!

09.roja: అవన్నీ వెంటనే డిలీట్ చేయండి. హెచ్చరించిన రోజా.!

ఈ మధ్య మీడియా ముందుకు రావడాన్ని కాస్త తగ్గించిన రోజా.. ఉన్నట్టుండి.. ఈ సారి కాస్త సీరియస్‌గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. తన పేరిట ఎలాంటి అఫీషియల్ యూట్యూబ్‌ ఛానెల్స్ లేవంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. అన్‌ అఫీషియల్‌గా తన పేరు మీద చలామణిలో ఉన్న ఛానల్స్‌ను వెంటనే డిలీట్ చేయాలని సదరు వ్యక్తలకు వార్నింగ్ ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.