TOP 9 ET: దేవరకు ఏపీ సీఎం బంపర్ ఆఫర్.. థ్యాంక్స్‌ చెప్పిన NTR|వెలుగులోకి జానీ మాస్టర్ రాస లీలలు?

|

Sep 22, 2024 | 3:16 PM

ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27న.. రిలీజ్ అవుతున్న దేవర మూవీకి.. చంద్రబాబు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏపీలో టికెట్స్ రేట్స్ ను పెంచుకునేందుకు.. దేవర టీంకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీఫ్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై 135రూపాయలు.. సింగిల్ స్క్రీన్‌ థియేటర్లలో.. అప్పర్ క్లాస్‌ అయితే.. ఒక్కో టికెట్‌ పై 110 రూపాయలు.. లోయర్ క్లాస్ అయితే ఒక్కో టికెట్‌ పై 60 రూపాయలు పెంచుకోవచ్చంటూ దేవర మేకర్స్కు పర్మిషన్ ఇచ్చింది.

01.Devara: దేవరకు ఏపీ సీఎం బంపర్ ఆఫర్ థ్యాంక్స్‌ చెప్పిన NTR.!

ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27న.. రిలీజ్ అవుతున్న దేవర మూవీకి.. చంద్రబాబు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏపీలో టికెట్స్ రేట్స్ ను పెంచుకునేందుకు.. దేవర టీంకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీఫ్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై 135రూపాయలు.. సింగిల్ స్క్రీన్‌ థియేటర్లలో.. అప్పర్ క్లాస్‌ అయితే.. ఒక్కో టికెట్‌ పై 110 రూపాయలు.. లోయర్ క్లాస్ అయితే ఒక్కో టికెట్‌ పై 60 రూపాయలు పెంచుకోవచ్చంటూ దేవర మేకర్స్కు పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ టికెట్ రేట్స్‌ పెంపుదలకు.. సినిమా రిలీజ్ డేట్ నుంచి 9 రోజుల పాటు మాత్రమే వ్యాలిడిటీగా ఇచ్చింది. ఇక కూటమి ప్రభుత్వం తమ సినిమాకు.. సానుకూలంగా పర్మిషన్స్ ఇవ్వడంతో.. అటు ఎన్టీఆర్.. ఇటు కళ్యాణ్ రామ్‌.. ఏపీ సీఎం చంద్రబాబుకు.. డిప్యూటీ సీఎం పవన్‌కు.. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు స్పెషల్ థ్యాక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.

02.johnny: ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న జానీ మాస్టర్ రాస లీలలు.?

జానీ మాస్టర్ అరెస్ట్‌తో.. ఫిల్మ్ ఫెటర్నిటీ మొత్తం ఈ ఇష్యూ గురించే మాట్లాడుకుంటోంది. ఇక క్రమంలోనే జానీ మాస్టర్ రాసలీలలు గురించి ఆయనతో పని చేసిన కొంత మంది జూనియర్ కొరియోగ్రాఫర్లు సోషల్ మీడియాలో పోస్టుల పెడుతున్నారు. ఇంటర్వ్యూలిస్తున్నారు. జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్లతో కాస్త అతిగా బిహేవ్‌ చేసేవాడని.. చెబుతున్నారు. అంతేకాదు జానీ మాస్టర్ చేసిన పనుల గురించి మరో ఇద్దరూ లేడీ డ్యాన్సర్లు షాకింగ్ విషయాలు చెప్పినట్టు ఇండస్ట్రీలో ఓ చర్చ నడుస్తోంది. తొందర్లో వారిద్దూ కూడ మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

03.prabhas: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాఖా.!

ఇంచ్ గ్యాప్ లేకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తున్న ప్రభాస్‌.. ఇప్పుడు తన డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాఖా ఇచ్చేందు రెడీ అవుతున్నాడట. హను రాఘవపూడి డైరెక్షన్లో తాను చేస్తున్న ఫౌజీ సినిమా గ్లింప్స్‌ను దరసరా కానుకగా రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారట ప్రభాస్. ఇదొక్కటే కాదు.. మారుతీ డైరెక్షన్లో తను చేస్తున్న రాజా సినిమా టీజర్‌ను కూడా తన బర్త్‌ డే రోజే బయటికి వచ్చేలా ప్లాన్ చేశారట మన మన పాన్ ఇండియా హీరో.

04. akhil: శపథం చేసిన అఖిల్ హిట్టు కొట్టాకే.!

ఆఫ్టర్ ఏజెంట్ డిజాస్టర్..! అయ్యగారు అసలు మీడియా ముందుకు రావడమే మానేశారు. అనుకోకుండా.. అలా వెళుతూ మీడియాకు చిక్కడం తప్ప.. కావాలని అఫీషియల్గా మాట్లాడం స్కిప్ చేస్తున్నారు. కనీసం ఫ్యాన్స్ ముందుకు కూడా రావడం లేదు. అయితే అఖిల్ ఇలా ఎందుకు చేస్తున్నాడో తాజాగా చెప్పాడు కింగ్ నాగ్. తన సినిమా హిట్టయ్యే వరకు అభిమానుల ముందుకు రావొద్దని తన కొడుకు అఖిల్ నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. ANR శతజయంతి ఈవెంట్లో ఈ మాటలు చెప్పాడు నాగ్.

05.prakash raj: పవన్‌ vs ప్రకాశ్ రాజ్ మధ్యలో మంచు విష్ణు.!

ఏపీలో లడ్డూ వివాదం కాస్తా ఇప్పుడు మరో టర్న్‌ తీసుకుంటోంది. ఇదే విషయంగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను విమర్శిస్తూ ప్రకాశ్ రాజ్‌ ట్వీట్‌ చేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ టాపిక్‌లోకి ఇప్పుడు మంచు మనోజ్ ఎంట్రీ ఇచ్చాడు. పవన్‌ కళ్యాణ్‌కు మద్దతిస్తూ.. ప్రకాశ్‌ రాజ్‌ను విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం కాదని.. తన లాంటి కోట్ల మంది హిందువులకు ఓ నమ్మకమని.. మంచు విష్ణు తన ట్వీట్లో రాసుకొచ్చాడు. దర్యాప్తు జరగాలంటూ పవన్‌ కళ్యాణ్ కరెక్ట్‌గా నే మాట్లాడారని.. మతకల్లోలాల రంగు ఎవరు ఎక్కడ పులుముతున్నారో ఒక సారి ఆలోచించుకుంటూ మంచిదేమో అంటూ ప్రకాశ్‌కు కౌంటర్‌ ఇచ్చాడు విష్ణు. ఇక విష్ణు చేసిన ఈ ట్వీట్‌కు ప్రకాశ్ రాజ్‌ కూడా రియాక్టయ్యాడు. ఓకే శివయ్యా.. నాకు నా దృక్కోణం ఉంటే.. మీకు మీ ఆలోచన ఉంటుంది నోటెడ్ అంటూ.. కౌంటర్ ట్వీట్ చేశాడు.

06.Vetrimaran: NTR కామెంట్స్ ఎఫెక్ట్ సినిమా తీసేందుకు రెడీ అయిన వెట్రిమారన్.!

వెట్రిమారన్‌తో సినిమా చేయాలని.. తన మనసులోని మాటను యంగ్ టైగర్ ఎన్టీఆర్ పబ్లిక్‌గా అలా బయట పెట్టారో లేదో.. ఇలా తారక్‌తో సినిమా చేసేందుకు రెడీ అయిపోయారు వెట్రిమారన్. ఇదే విషయాన్ని రీసెంట్‌ మీడియాతోనే చెప్పేశారు. తన అండర్‌లో ఉన్న సినిమాలు అన్నీ ఫినిష్ అయ్యాక.. ఎన్టీఆర్తో సినిమా చేస్తానన్నారు. ఇప్పటికే తాను చెప్పిన లైన్ తారక్‌కు బాగా నచ్చిందంటూ.. అసలు విషయాన్ని రివీల్ చేశారు వెట్రిమారన్‌.

07.Devara: వావ్‌! హాలీవుడ్ న్యూస్ ఛానెల్లో దేవర ట్రైలర్ .

దేవర ట్రైలర్‌ తెలగు స్టేట్స్‌లో.. పాన్ ఇండియా లాంగ్వేజెస్‌లో మాత్రమే కాదు.. హాలీవుడ్ న్యూస్ ఛానెల్లో కూడా మార్మోగిపోతోంది. ఇప్పటికే అమెరికాలో 1 మిలియన్ అడ్వాన్స్‌ టికెట్స్‌ బుకింగ్స్‌ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డు కెక్కిన దేవర.. ఫాన్ డాన్‌గో .. బిగ్ టికెట్‌ నౌ.. హాలీవుడ్‌ షోలో న్యూస్ గా మారింది. దేవర ట్రైలర్ ఆ షోలో ప్లే అయింది.

08.bigg boss: నాగ్ సీరియస్ దెబ్బకు మోకాళ్లపై కూర్చొని వేడుకున్న కంటెస్టెంట్.

బిగ్ బాస్ షోను పక్కకు పెడితే.. బిగ్ బాస్ ప్రోమోస్‌ మాత్రం ఎవ్వరీ డిస్సపాయింట్ చేయకుండానే ఉంటాయి. చిన్న పాటి ఉత్కంఠతను క్రియేట్ చేస్తాయి. షో చూసేయాల్సందే అనేంత ఈగర్‌ను క్రియేట్ చేస్తాయి. ఇక శనివారం అంటే సెప్టెంబర్ 21 సాయంత్రం రిలీజ్ అయిన బీబీ8 ప్రోమో కూడా అందర్నీ అదిరిపోయే రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమోలో.. బిబీ కంటెస్టెంట్‌ అభయ్‌ బిగ్ బాస్‌ను విమర్శించడం.. అది కాస్తా నాగార్జునకు కోపం తెప్పిచడంతో.. అభయ్‌ను గెట్‌ అవుట్ ఆఫ్ ది షో అంటూ.. రెడ్ కార్డ్‌ ఇష్యూ చేస్తాడు. అభయ్‌ ఏడుచుకుంటూ మోకాళ్ల పై పడి మరీ నాగ్‌ను వేడుకుంటాడు. అయితే ఈ ప్రోమో కట్ .. ఇప్పుడు షోకు సంబంధం లేకుండా నెట్టింట వైరల్ అవుతోంది.

09.sharukh: 20 ఏళ్ల తర్వాత 100 కోట్లు సాధించిన షారుఖ్‌ మూవీ.

జనరల్‌గా షారుఖ్ సినిమా ఒక్క రోజులోనే 100 కోట్లు వసూలు చేస్తుంది. కాస్త అటూ ఇటైనా కూడా.. రెండు రోజుల్లో ఈ మార్క్‌ను రీచ్‌ అవుతుంది. అలాంటిది, ఈ షారుఖ్ సినిమా మాత్రం… 100 కోట్లు సాధించడానికి 20 ఏళ్ల టైం తీసుకుంది. ఆ సినిమానే వీర్‌ జారా! ఆదిత్య చోప్రా డైరెక్షన్లో షారుఖ్ చేసిన ఈ సినిమా 2004లో రిలీజ్ అయింది. అప్పట్లో వరల్డ్ వైడ్ 97 కోట్లను వసూలు చేసింది. ఆ తర్వాత పలు సార్లు రీలీజ్‌ అవుతూ.. వస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఈ ఏడాది 282 థియేటర్లో రీ- రిలీజ్ అయి.. మొత్తానికి 100 కోట్లను సాధించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.