TOP9 ET: రామ్ చరణ్‌ను చూసి ఈర్ష్య పడతా | 25 రోజుల్లోనే 300కోట్లు.. హనుమాన్ రికార్డు.
ప్రస్తుతం మదర్‌గా... కాస్త బిజీగా ఉంటున్న ఉపాసన... తన భర్త పై షాకింగ్ కామెంట్స్ చేశారు. క్లింకార.. తన తండ్రి చెర్రీని చూడగానే.. కళ్లలో మెరుపుతో.. బోసి నవ్వులు నవ్వుతుంటుందని.. వాళ్ల మధ్య ఉన్న ఆ బాండ్ ఎంతో స్పెషల్ అని.. ఆ బాండ్ చూస్తుంటే తనకు ఈర్ష్య వేస్తుందంటూ.. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో మెగా ఫ్యాన్స్.. తమ హీరోకు బెస్ట్ ఫాదర్ అంటూ నెట్టింట వైరల్ చేయడం కూడా షురూ చేశారు.
01.ram charan
రామ్ చరణ్‌ను చూసి ఈర్ష్య పడతా.
ప్రస్తుతం మదర్‌గా… కాస్త బిజీగా ఉంటున్న ఉపాసన… తన భర్త పై షాకింగ్ కామెంట్స్ చేశారు. క్లింకార.. తన తండ్రి చెర్రీని చూడగానే.. కళ్లలో మెరుపుతో.. బోసి నవ్వులు నవ్వుతుంటుందని.. వాళ్ల మధ్య ఉన్న ఆ బాండ్ ఎంతో స్పెషల్ అని.. ఆ బాండ్ చూస్తుంటే తనకు ఈర్ష్య వేస్తుందంటూ.. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో మెగా ఫ్యాన్స్.. తమ హీరోకు బెస్ట్ ఫాదర్ అంటూ నెట్టింట వైరల్ చేయడం కూడా షురూ చేశారు.
02. hanuman
25 రోజుల్లోనే 300కోట్లు చరిత్ర సృష్టించిన హనుమాన్
హనుమాన్ మూవీ మరో హిస్టరీ క్రియేట్ చేసింది. జస్ట్ 25 రోజుల్లోనే ఈ మూవీ 300 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ ఫీట్‌తో.. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ మూవీ ప్రశాంత్ వర్మ డైరెక్ష్లో.. తేజ సజ్జా హీరోగా తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి.. 92 ఏళ్ల తెలుగు ఫిల్మ్ హిస్టరీలోనే.. బిగ్గెస్ట్ సంక్రాంతి హిట్ గా రికార్డుకు కూడా ఎక్కింది.
03. Prabhas kalki
దిమ్మతిరిగిపోయేలా.. కల్కిలో ప్రభాస్ ఎంట్రీ, BGM
ప్రభాస్ మెస్ట్ అవేటెడ్ మూవీ కల్కి నుంచి మరో లీక్ బయటికి వచ్చింది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న సంతోష్ నారాయణన్ తాజాగా ఈ మూవీ గురించి అందులోనూ ప్రభాస్ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కల్కి మూవీలో.. ప్రభాస్ ఎంట్రీ BGM చాలా స్పెషల్‌గా.. మాస్‌గా ఉంటుందటూ రివీల్ చేశారు. తన మాటలతో మరోసారి రెబల్ స్టార్‌ను.. సోషల్ మీడియా ట్రెండింగ్‌లోకి తెచ్చారు.
04. Thandel
తండేల్ షెడ్యూల్ ఖతమ్.
నాగ చైతన్య, సాయి పల్లవి లీడ్‌లో.. చందూ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న ఫిల్మ్ తండేల్. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ నుంచే మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ మూవీ షూటింగ్, కొన్ని రోజులుగా కర్ణాటక, ఉడిపిలో జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ తాజాగా ఖతమ్ అయింది. ఇక ఇదే చెబుతూ.. మేకర్స్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి తాజాగా ఫోటోలు వదిలారు.
05. Gunturu Karam
మావా ఎంతైనా పర్లేదు బిల్లు..!
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం మూవీ సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైంది. రమణ గాడి తడాఖా ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేసింది. 200 కోట్లకు పైగా వసూల్లు సాధించింది. అలాంటి ఈ సినిమా నుంచి థర్డ్ వీడియో సాంగ్.. రిలీజ్ అయింది. రిలీజ్ అవడమే కాదు.. యూట్యూబ్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్‌తో.. సోషల్ మీడియాలో రీల్స్ తో దూసుకుపోతోంది.
06.Salaar
ఇంటర్నేషనల్ రేంజ్‌కు ప్రభాస్ ఇంగ్లీష్‌లో రిలీజైన సలార్
రిలీజ్ దగ్గర నుంచే సంచలనాలు నమోదు చేస్తున్న సలార్, మరో అరుదైన రికార్డ్ సెట్ చేసింది. ఈ మూవీ ఇంగ్లీష్ వర్షన్, తాజాగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ.. తాజాగా ఇంగ్లీష్‌లో కూడా అందుబాటులోకి రావడం.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. అయితే సలార్ హిందీ వర్షన్ మాత్రం.. ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ వర్షన్ మార్చిలో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉందని.. నెట్‌ఫ్లిక్స్ నుంచి న్యూస్.
07.Eagle
ఈగల్ సినిమా చూసి థియేటర్లోనే ఎగిరిగంతేసిన రవితేజ
మాస్ రాజా రవితేజ.. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో చేస్తున్న మూవీ ఈగల్. ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న ఈ మూవీని.. తాజాగా డైరెక్టర్, ప్రొడ్యూసర్తో కలిసి చూశారు రవితేజ. ఇక ఈ సినిమా అవుట్‌పుట్‌కు ఫిదా అయిన మాస్ రాజా.. సినిమా అవగానే సూపర్బ్ ఐమాయ్ సాటిఫై అంటూ.. థియేటర్లోనే గట్టిగా అరిచారు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని అప్రిషియేట్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈగల్‌పై మరింతగా అంచనాలను పెంచుతోంది.
08.prabhas
మాటల్లో చెప్పలేను.. చేతల్లో చూపిస్తా..
చిన్న సినిమాలతో.. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ స్టేజ్‌కు రీచైన మారుతీ.. తాజాగా ప్రభాస్ రాజాసాబ్ గురించి మాట్లాడారు. రాజాసాబ్ అప్డేట్ కోసం వెయిట్ చేయండని డార్లింగ్ ఫ్యాన్స్‌కు చెబుతూనే.. ప్రభాస్‌తో తాను తీయబోయే సినిమా గురించి మాటల్లో చెప్పలేనంటూ కామెంట్ చేశారు. చేతల్లో చూపిస్తా అంటూ డార్లింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ను అరిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..