చిరంజీవి వల్ల కాలేదు.. పోనీ.. బాలయ్య చేశాడా? అదీ లేదు
టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలకు ప్రసిద్ధి. అయితే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోలు పాన్ ఇండియా ప్రయత్నాల్లో వెనుకబడి ఉన్నారు. సైరా, అఖండ తాండవం, సైంధవ వంటి కొన్ని ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, వారు తమ ప్రాంతీయ బౌండరీలలోనే సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా విజయాలు సాధిస్తున్నా, సీనియర్లు మాత్రం స్థానిక ప్రేక్షకులపైనే దృష్టి సారిస్తున్నారు.
పాన్ ఇండియా సినిమాలకి కేరాఫ్ అని ట్యాగ్ తెచ్చుకున్న టాలీవుడ్‌లో.. మన సీనియర్ హీరోలు మాత్రం ఇంకా వెనకే ఉన్నారు. ఇంకో మాట చెప్పాలంటే.. పాన్ ఇండియా వద్దనేట్టు అడుగులు వేస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరు పాన్ ఇండియాలో రాణించాలని సైరా చేశాడు. కానీ అది వర్కవుట్ కాకపోవడంతో.. టాలీవుడ్‌కే పరిమితమై సినిమాలు చేస్తున్నాడు. ఇక బాలయ్య కూడా అఖండ తాండవం సినిమాతో పాన్ ఇండియాపై గురిపెట్టాడు. హిందీలో డైలాగ్స్ చెప్పాడు. ముంబయ్, చెన్నైల్లో తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. కానీ రిజల్ట్ ఆశించినంతగా రాకపోవడంతో.. వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇక వెంకీ మామ కూడా సైంధవ తో ఓ ప్రయత్నం చేశాడు కానీ బెడిసి కొట్టడంతో.. మళ్లీ పక్కా సంక్రాంతి పండగ లాంటి సినిమాతో హిట్ కొట్టాడు. ఇక కింగ్ నాగార్జునకు అయితే.. మొదటి నుంచి పాన్ ఇండియాకు దూరంగానే ఉంటున్నాడు. ఇలా మన సీనియర్ హీరోలు ఉన్న బౌండరీలోనే సినిమాలు ప్లాన్ చేసుకుంటూ.. ముందుకు పోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rakul Preet: ప్లాస్టిక్ సర్జరీ బాడీ అంటూ ట్రోల్స్.. సీరియస్ అయిన రకుల్
Rashmika Mandanna: దోస్తులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన రష్మిక.. ఫోటోలు వైరల్
Allu Arjun: బన్నీ కోసం 1758 కిలోమీటర్ల సైకిల్ యాత్ర! తెలిసి అక్కున చేర్చున్న ఐకాన్ స్టార్
Dhurandhar: దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి! ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఆకస్మిక మృతి!
