2 వారాలు.. 12 సినిమాలు.. దండయాత్రే

Updated on: Dec 17, 2025 | 5:15 PM

మరో 15 రోజుల్లో కొత్త ఏడాది వస్తుండగా, డిసెంబర్ చివరి రెండు వారాల్లో 12 సినిమాలు విడుదల కానున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 19న 'అవతార్ 3' విడుదల కాగా, అదే రోజున, క్రిస్మస్ వీకెండ్‌లో 9 చిన్న తెలుగు సినిమాలు భారీ పోటీకి సిద్ధమవుతున్నాయి. చిన్న చిత్రాలు, స్టార్ వారసుల రీలాంచ్‌లు, అగ్ర నిర్మాణ సంస్థల సినిమాలు కలగలిపి బాక్సాఫీస్‌లో పెద్ద యుద్ధమే జరగనుంది.

మరో 15 రోజుల్లో కొత్త ఏడాది రాబోతుంది.. ఆ లోపు మిగిలింది రెండు శుక్రవారాలు మాత్రమే..! వాటికోసం పెద్ద యుద్ధమే జరుగుతుంది. మరీ ముఖ్యంగా చిన్న సినిమాల మధ్య పెద్ద యుద్ధమే జరగబోతుంది. 2025 లాస్ట్ 2 వీక్స్ పీక్స్ చూపించబోతున్నారు. అగ్ర నిర్మాణ సంస్థలు, చిన్న నిర్మాతలు కలగలిపి దండయాత్రకు రెడీ అవుతున్నారు. మరి ఆ సినిమాలేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? 2 వారాలు.. 12 సినిమాలు.. డిసెంబర్ చివరి రెండు వారాల్లో బాక్సాఫీస్ పరిస్థితి ఇది. అందులో మూడు సినిమాలు మాత్రమే డిసెంబర్ 19న వస్తుంటే.. మిగిలిన 9 సినిమాలు క్రిస్మస్ వీకెండ్ వచ్చేస్తున్నాయి. చిన్న సినిమాల దండయాత్ర పెద్దగానే జరగబోతుంది. వీళ్లందరిలో అవతార్ 3 లీడ్ తీసుకోబోతుంది. ఈ వారమే అత్యంత భారీగా వస్తుంది ఈ చిత్రం. అవతార్ 3పై ఇండియాలోనూ అంచనాలు భారీగానే ఉన్నాయి. డిసెంబర్ 19న రాబోయే సినిమాల్లో అగ్ర తాంబూలం వెళ్లేది దీనికే. అదేరోజు గుర్రం పాపిరెడ్డి అంటూ నవ్వించడానికి వచ్చేస్తున్నారు నరేష్ అగస్త్య, బ్రహ్మి అండ్ బ్యాచ్. దాంతో పాటే రాజేంద్రప్రసాద్ నటిస్తున్న సహకుటుంబానాం అనే సినిమా సైతం డిసెంబర్ 19నే రానుంది. 2025లో చివరి యుద్ధం క్రిస్మస్ వీకెండ్ కోసమే జరగబోతుంది. ఈ ప్లేస్ కోసం 3 నెలల ముందుగానే ఖర్చీఫ్ వేసారు ఆది సాయికుమార్. ఆయన నటిస్తున్న శంభాలా డిసెంబర్ 25న రానుంది. ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్స్‌లోనే విడుదలవుతుంది. ఇక 25నే రానున్న మరో క్రేజీ మూవీ ఛాంపియన్. శ్రీకాంత్ తనయుడు రోషన్‌కు రీ లాంఛ్ ఈ సినిమా. వైజయంతి మూవీస్ నుంచి ఈ ఛాంపియన్ వస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ పతంగ్.. సీనియర్ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలంగాణ బ్యాక్‌డ్రాప్ సినిమా దండోరా.. బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న ఈషా.. మోహన్ లాల్ వృషభ.. సుదీప్ మార్క్.. కార్తి అన్నగారు వస్తారు కూడా క్రిస్మస్ రోజే రానున్నాయి. వానర అనే మరో సినిమా ఆ మరుసటి రోజు వస్తుంది. ఇలా డిసెంబర్ చివరి 2 వారాలు ఫుల్ ప్యాక్ అయిపోయాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్‌బాస్ టైటిల్ నాదే నాన్నా.. భరణికి లీకిచ్చిన తనూజ..

ఫైనల్ ఓటింగ్.. ఎవ్వరికీ అందకుండా దూసుకుపోతున్న కళ్యాణ్‌

తండ్రి ఆసుపత్రి బెడ్‌పై.. కొడుకు మరణశయ్యపై.. నటుడి మిస్టరీ డెత్

Sai Pallavi: మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్

పెద్ది తెలుగు రికార్డులను కొల్లగొట్టిన పవన్ కల్యాణ్