AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ సినిమా వాళ్లు కాసింతైనా మానవత్వంతో స్పందించండబ్బా

ఓ సినిమా వాళ్లు కాసింతైనా మానవత్వంతో స్పందించండబ్బా

Phani CH
|

Updated on: Oct 25, 2025 | 11:47 AM

Share

మనిసన్నాక కాసింతైన మానవత్వం ఉండాలి. సాయం చేసేందుకు అందరూ ముందుకు రాకపోయినా.. ఓ ప్రమాదం గురించే తెలిస్తే చాలు.. అయ్యో పాపం అంటూ రియాక్టవుతారు. వారి గురించి క్షణమైనా బాధపడతారు.ఆ దేవుడిని ప్రార్థిస్తారు. అయితే ఈ లక్షణమే ఇప్పుడు మన టాలీవుడ్ సెలబ్రిటీల్లో కరువైందా? అక్టోబర్ 24 ఉదయం నుంచే.. కర్నూలు హైపే పై జరిగిన ఘోర ప్రమాదం గురించి తెలుగు టూ స్టేట్స్‌లో చర్చ జరుగుతోంది.

మరో పక్క సోషల్ మీడియా.. మెయిన్ స్ట్రీమ్‌ మీడియా ఇదే న్యూస్‌కు సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తూనే ఉంది. అయినా కానీ.. మన టాలీవుడ్ సెలబ్రిటీలకు చీమ కుట్టినట్టుగా కూడా లేకపోవడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. ఈ ప్రమాద ఘటనను ఉద్దేశిస్తూ ఒకరిద్దరు మినహా.. పెద్ద హీరోలెవరూ ట్వీట్ చేయకపోవడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో అయితే పెద్ద చర్చనే లేవనెత్తుతోంది. టాలీవుడ్‌ లో జరిగే ప్రతీ మంచీ చెడుకు దాదాపు సెలబ్రిటీలందరూ రియాక్టవుతుంటారు. తమ తోటి సెలబ్రిటీల జీవితాల్లోని సంతోషకరమైన క్షణాలపై.. బాధాకర పరిస్థితులపై పోస్టులు పెడతుంటారు. ఒకరి పోస్టులను మరొకరు రీట్వీట్లు కూడా చేస్తుంటారు. వాటితో వైరల్ కూడా అవుతుంటారు. కానీ ఇలాంటి భయంకరమైన ప్రమాదలప్పుడు మాత్రం మన సెలబ్రిటీలు సైలెంట్ గా ఉండడం ఎంత వరకు కరెక్ట్ అని వీళ్ల ఫాలోవర్సే ఇప్పుడు నెట్టింట ప్రశ్నిస్తున్నారు. సెలబ్రిటీల తీరు మారాలి.. ఇలాంటి సందర్భాల్లో కూసింతైన మానవత్వం చూపించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విక్రమ్‌ కొడుకు ఈ సారైన ఆకట్టుకుంటాడా? హిట్టా..? ఫట్టా..?

బిగ్ బాస్‌ షోపై సీరియల్ నటి సంచలన కామెంట్స్

జాన్వీకపూర్‌కు అండాదండా ఆయనేనా

Diwali: టపాసుల్లా కార్బైడ్ గన్‌ను పేల్చి .. కంటి చూపు కోల్పోయిన 14 మంది

కళ్యాణమండపానికి వచ్చిన అనుకోని అతిథి