TOP 9 ET News: మిరాయ్‌ హీరోకు కోట్ల విలువ చేసే సర్‌ప్రైజ్‌ గిఫ్ట్

Updated on: Sep 18, 2025 | 7:56 PM

ప్రధాని మోదీకి తెలుగు స్టార్ హీరోలు బర్త్‌ డే విషెస్ చెప్పారు. ఆయురారోగ్యాలతో.. భారతదేశాన్ని మోదీ ఎప్పుడూ ఉన్నత శిఖరాల వైపు.. నడిపించాలని.. చిరు ఆకాంక్షించారు. మోదీకి బర్త్‌డే విషెస్ చెప్పారు. ఇక జనసేనాని పవన్‌ కూడా మోదీకి విషెస్ చెబుతూ ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు. మన దేశాన్ని ముందుకు సాగిస్తున్న ఆయన తీరును.. తన పోస్టులో పవన్‌ కొనియాడారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మోదీకి బర్త్‌ డే విషెస్ చెప్పారు. కింగ్ నాగార్జున కూడా.. నరేంద్ర మోదీకి 75 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ.. తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. రామ్ చరణ్ కూడా మోదీకి బర్త్‌ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు.

ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 5న థియేటర్లోకి వచ్చిన మిరాయ్‌ మూవీ.. సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్‌ వచ్చేలా చేసుకుంటోంది. ఏకంగా 100 కోట్లు మార్క్‌కు రీచ్‌ అయింది. దీంతో ఈ మూవీ టీం.. విజయవాడలోని గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఆ ఈవెంట్‌లోప్రొడ్యూసర్ విశ్వప్రసాద్‌… హీరో తేజా సజ్జాకు సూపర్ గిఫ్ట్ ఇస్తున్నట్టు చెప్పి సర్‌ప్రైజ్‌ చేశాడు. కోట్లు విలువ చేసే బ్రాండ్ న్యూ లగ్జరీ కార్ ను గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. హీరోకి మాత్రమే కాదు.. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనికి కూడా కార్‌ గిఫ్ట్గా ఇవ్వబోతున్నట్టు చెప్పాడు ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

OG గన్స్‌ అండ్ రోజెస్‌తో.. సోషల్ మీడియాలో అగ్గి పుట్టిస్తున్న తమన్‌

మీ తీరు నాకు నచ్చలేదు !! తెలుగు ట్రైలర్‌ పై నొచ్చుకున్న స్టార్ కమెడియన్

Hyderabad Rains: కుంభవృష్టితో వణికి పోయిన భాగ్యనగరం

SR Nagar: గాలివానకు కాలేజీ భవనంపై విరిగిపడిన భారీ వృక్షం

ఇళయరాజా దెబ్బకు.. అజిత్‌కు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్‌