డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రిలో చేరిన విజయ్‌ దేవరకొండ

Updated on: Jul 19, 2025 | 6:34 PM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవ‌ర‌కొండ మరికొన్ని రోజుల్లో కింగ్ డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గౌతం తిన్న‌నూరి తెరకెక్కించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో మెరిశాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 31న రిలీజ్ కానుంది.

అయితే తన సినిమా రిలీజ్ కు కొన్ని రోజుల ముందే హీరో విజయ్‌ దేవరకొండ ఆస్పత్రిపాలవ్వడం ఇప్పుడు అంతటా హాట్‌ టాపిక్ అవుతోంది. విజయ్‌ దేవరకొండ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్టార్ హీరో బెంగుళూరులోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని సమాచారం. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆందోళనకు గురవువుతున్నారు. విజయ్ వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక విజయ్ కు విశ్రాంతి బాగా అవసరమని డాక్టర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 20 న విజయ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నట్లు సమాచారం. అయితే విజయ్ దేవరకొండ ఆరోగ్యం విషయంపై అటు అతని టీమ్ కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎన్ని AIలు వచ్చినా మనిషి మేధస్సుకు ఢోకా లేదు

చిన్నోడనుకునేరు.. మనోడు మహా రసికుడు..

గుడ్డు వారికి పాయిజన్‌తో సమానం!

సొంత మనవళ్లే కాడేద్దులు.. హృదయాలను కుదిపేస్తున్న రైతన్న కష్టాలు

పొద్దున్నే తలుపు తీయగానే.. గుండెలు బద్దలయ్యే సీన్