‘నీ యాంకరింగ్ రప్పా రప్పా’.. దెబ్బకు గాల్లో తేలిపోయిన తెలుగు యాంకర్

Updated on: Jul 08, 2025 | 7:22 PM

ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన NATS 2025 వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. తన ప్రజెన్స్‌తో టంపాలో ఉన్న తెలుగు వాళ్లను అరిపించేశాడు ఐకాన్ స్టార్. అంతేకాదు తన పుష్ఫ2 సినిమాలోని డైలాగులను నాట్స్‌ స్టేజ్‌పై చెప్పాడు. తన డైలాగ్‌ డెలివరీతో.. ఈవెంట్‌కి వచ్చిన అందర్నీ ఉర్రూతలూగించాడు. నాట్స్ 2025కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.

ఇక చివర్లో యాంకర్‌ని పొగిడేసి… ఆమెను మురిసిపోయేలా చేశాడు. దీంతో నెట్టింట వైరల్ అవుతున్నాడు మన ఐకాన్ స్టార్. ఎట్ ప్రజెంట్ అట్లీ సినిమా ప్రీ పొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఉన్నట్టుండి నాట్స్ ఈవెంట్‌లో ఫ్లాష్‌ అయ్యారు. ఆ ఈవెంట్‌లోనే స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. అంతేకాదు అక్కడి తెలుగువారి నుంచి ఐకాన్ స్టార్‌కు ఘనస్వాగతం లభించింది. బన్నీని చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా ‘ఇండియన్స్‌ ఎక్కడున్నా తగ్గేదేలే.. అందులో తెలుగువాళ్లయితే అస్సలు తగ్గేదేలే..’, ‘తెలుగోళ్లంటే ఫైర్‌ అనుకున్నారా? వైల్డ్‌ ఫైర్‌’ అని డైలాగ్స్‌ చెప్పాడు అల్లు అర్జున్. ఇక సినిమాల్లోని డైలాగులతో పాటు.. చివర్లో యాంకర్‌ శ్రీముఖిని ఉద్దేశిస్తూ.. మీ యాంకరింగ్‌ మాత్రం రప్పా రప్పా అని పొగిడేశాడు. దీంతో శ్రీముఖి మురిసిపోయింది. అది కాస్తా క్యాప్చర్ చేసిన కొంత మంది… బన్నీ డైలాగ్‌ను.. శ్రీముఖి మురిసిపోయిన్ క్లిప్‌ను యాడ్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. శ్రీముఖిని మోసేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుత్తాజ్వాల బిడ్డకు పేరు పెట్టిన అమీర్‌ ఖాన్.. ఒక్క సారిగా ఎమోషనల్ అయిన క్రీడాకారిణి

Kubera: అప్పుడే OTTలోకి కుబేర మూవీ…

మళ్లీ ఆ తప్పు చేయను.. బహిరంగ క్షమాపణలు చెప్పిన కలర్ ఫొటో డైరెక్టర్

రష్మికపై పని ఒత్తిడి.. బాధేస్తుందంటూ హీరోయిన్ ఎమోషనల్

ముందు మహేషే రాముడు !! కానీ ఆ ఇబ్బందితో పక్కకి..