Vijay Ranjithame song: 75 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్న.. ‘రంజితమే’ తెలుగు వెర్షన్ రిలీజ్..
రంజితమే.. రంజితమే’.. తళపతి విజయ్ నటించిన ‘వారిసు’లోని ఈ పాట విడుదలైన 25 రోజుల్లోనే 7 కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.
‘రంజితమే.. రంజితమే’.. తళపతి విజయ్ నటించిన ‘వారిసు’లోని ఈ పాట విడుదలైన 25 రోజుల్లోనే 7 కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. తమిళ సినీ ప్రియులతో డ్యాన్స్ చేయిస్తోంది. ఇప్పుడిదే పాటకు తెలుగు వెర్షన్‌ను చిత్రబృందం విడుదల చేసింది.‘రంజితమే’ తెలుగు పాటకు ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. తమిళంలో విజయ్ పాడిన ఈ పాటను తెలుగులో అనురాగ్ కులకర్ణి, ఎం.ఎం.మానసి ఆలపించారు. ఇక, తమన్ అందించిన మ్యూజిక్ యూత్‌తో డ్యాన్స్ చేయించేలా ఉంది.‘బీస్ట్’ తర్వాత విజయ్ నటిస్తోన్న చిత్రమిది. వంశీపైడిపల్లి దర్శకుడు. రష్మిక కథానాయిక. దిల్ రాజు నిర్మాత. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈసినిమా షూట్ శర వేగంగా జరుగుతోంది. జయసుధ, ఖుష్బూ, శరత్‌కుమార్, శ్రీకాంత్, ప్రభు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..