The Paradise: నాని ఉగ్రరూపం.. ప్యారడైజ్ టీజర్‌లో ప్యూర్ మ్యాడ్‌నెస్!
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్యాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ టీజర్ విడుదలైంది. ప్యూర్ మ్యాడ్‌నెస్ అంటూ హైప్ చేసిన మేకర్స్.. నాని ఉగ్రరూపం, పవర్‌ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే విజువల్స్‌తో అంచనాలు పెంచారు. మోహన్ బాబు, రాఘవ్ జుయల్, కయాదు లోహర్ పాత్రలకు టీజర్‌లో ప్రాధాన్యత లభించింది. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 24న సినిమా విడుదల కానుంది.
ది మోస్ట్ అవైటెడ్ ప్యారడైజ్ టీజర్ విడుదలైంది.. ప్యూర్ మ్యాడ్‌నెస్ అంటూ ప్రమోట్ చేసుకున్నారు కదా మరి అదే రేంజ్‌లో టీజర్ కూడా ఉందా..? ఇంత లేట్ అవుతున్నా కూడా తనపై నాని పెట్టుకున్న నమ్మకాన్ని శ్రీకాంత్ ఓదెల నిలబెట్టుకున్నారా..? అసలు టీజర్‌లో మేజర్ హైలైట్స్ ఏంటి..? ప్యారడైజ్‌పై నాని ఎందుకంత నమ్మకంగా ఉన్నారు..? టీజర్ రివ్యూ చూద్దాం పదండి.. చూస్తున్నారుగా నాని ఉగ్రరూపం.. దిష్టంతా పోవాలే అంటూ రక్తపాతమే సృష్టిస్తున్నారు. జడల్ జమానా షురూ అంటూ తనదైన స్టైల్‌లో రచ్చ చేసారు న్యాచురల్ స్టార్. ప్యారడైజ్ టీజర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు అలా అలా పెరగడం తప్ప ఇంకేం లేదు. శ్రీకాంత్ ఓదెల ఇంత టైమ్ తీసుకుంటున్నా నాని ఎందుకంత సైలెంట్‌గా ఉంటున్నారనే దానికి సమాధానమే ఇప్పుడు విడుదలైన టీజర్. ప్యారడైజ్ టీజర్‌లో మెయిన్ హైలైట్ డైలాగ్స్ అండ్ విజువల్స్. టీజర్ మొదలవ్వడమే నాని వాయిస్‌తో షురూ అయింది.. వెంటనే మోహన్ బాబు ఎంట్రీ.. ఆ తర్వాత విలన్ రాఘవ్ జుయల్, కయాదు లోహర్ షాట్స్.. ఇక నాని విశ్వరూపం.. టీజర్ చివర్లో దిష్టితీసే సీన్.. ఇలా ఒక్కోటి అదిరిపోయేలా డిజైన్ చేసుకున్నారు శ్రీకాంత్ ఓదెల. దసరా మాదిరే ఇందులోనూ కాకి సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. మొదట్నుంచీ ప్యారడైజ్ మీద నాని సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.. టీజర్‌తోనే సగం నమ్మకం నిలబెట్టేసారు ఓదెల. ఇందులోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు మేకర్స్. సెప్టెంబర్ 24న ప్యారడైజ్ విడుదల కానుంది. ఈ టీజర్‌లో మరో మేజర్ హైలైట్ అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్.. మొత్తానికి అంచనాలు అందుకుంటే ప్యారడైజ్ తర్వాత నాని మార్కెట్ కనీసం మూడు రెట్లు పెరగడం ఖాయం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్లాస్టిక్ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్ నోట్లు బంద్?
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
డెన్మార్క్ రాజకుమారి సంచలనం.. రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు.. తప్పు ఎక్కడ జరుగుతోంది?