ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో

Updated on: Nov 23, 2025 | 11:17 AM

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నాయి. మొదట సినీ రంగానికి మద్దతుగా నిలిచిన ఓటీటీలు ఇప్పుడు సొంత కంటెంట్‌పై దృష్టి సారిస్తున్నాయి. భారీ బడ్జెట్‌లతో డిజిటల్ మార్కెట్‌పై ఆధారపడిన నిర్మాతలకు ఇది నష్టాలకు దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త పరిస్థితిని పరిశ్రమ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

సిల్వర్ స్క్రీన్‌పై ఓటీటీల ఆధిపత్యం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కోవిడ్ సమయంలో సినీ పరిశ్రమకు ఓ కొత్త మార్కెట్‌గా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో వెండితెరకు సహాయకరంగా కనిపించిన ఈ ప్లాట్‌ఫారమ్‌లు, ప్రస్తుతం సినిమా విడుదలలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి. శాటిలైట్ మార్కెట్‌ను పూర్తిగా దెబ్బతీసిన ఓటీటీలు ఇప్పుడు థియేట్రికల్ రన్‌పైనా ప్రభావం చూపుతున్నాయి.