ధోనీ ఫ్యాన్‌ అంటూ తమన్ ను ఎద్దేవా చేసిన నెటిజన్.. ‘నీ అడ్రస్ చెప్పు..’ తమన్ మాస్ వార్నింగ్

Updated on: Jun 27, 2025 | 5:54 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. ఎప్పుడూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉండే ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే తమన్.. నిత్యం ఏదోక క్రేజీ పోస్ట్ చేస్తుంటారు. అలాగే పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. దాంతో పాటే తన ఫాలోవర్ల పోస్టులకు రిప్లై ఇస్తుంటారు.

అయితే తాజాగా ఓ నెటిజన్ తమన్ కు కోపం తెప్పించేలా కామెంట్ చేశారు. ధోనీ ఫ్యాన్స్‌ అంటూ తమన్‌ పరువు తీసినంత పని చేశాడు. దీంతో వైల్డ్ ఫైర్ అయిన తమన్.. ఆ నెటిజన్‌కు.. తన స్టైల్లో మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక అసలు విషయానికి వస్తే.. సీసీఎల్ లీగ్ లో తెలుగు వారియర్స్ తరుపున క్రికెట్‌ ఆడే తమన్… రీసెంట్‌ గా తన ప్రాక్టీస్ మ్యాచ్ వీడియోను తన ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఆ క్రికెట్ వీడియోకు డోంట్ బౌల్ షార్ట్ బ్రో అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవడంతో.. తమన్ షేర్ చేసిన ఈ వీడియోకు ఓ నెటిజన్‌ షాకింగ్ కామెంట్ చేశాడు. షార్ట్ కు.. స్లాట్ కు తేడా తెలియనప్పుడే నాకు అర్థమైంది.. నువ్వు ధోని ఫ్యాన్ అంటూ వ్యంగ్యంగా వీడియో కామెంట్స్‌ సెక్షన్‌లో రాసుకొచ్చాడు. ఇక ఇది చూసిన తమన్.. ఎప్పటిలాగే తన స్టైల్లో కౌంటరిచ్చాడు. ఒకే రా.. వచ్చి నేర్చుకుంటా అడ్రస్ పంపు అంటూ ఆ నెటిజన్‌పై వైల్డ్ గా ఫైర్ అయ్యాడు తమన్. అయితే ఇది కాస్తా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiranjeevi: చాలా దారుణం..! అమ్మ సంపూర్ణ ఆరోగ్యంగా కనిపిస్తుంటే ఇలాంటి వార్తలా ??

అతడిపై ప్రేమ లేదంటూనే.. ప్రేమపై తమన్నాకు ఇండైరెక్ట్‌ పంచ్‌

యువకుడిని కాటేసి.. చచ్చిపోయిన పాము.. బాధితుడి మాటలు విని డాక్టర్లు షాక్‌

అలాంటి వారిని వదిలిపెట్టను.. హెచ్చరించిన మంచు విష్ణు