కళకళలాడుతున్న షూటింగ్‌ స్పాట్‌లు.. ఏ హీరో ఎక్కడున్నారో తెలుసా

Edited By:

Updated on: Nov 04, 2025 | 10:26 PM

ఇయర్‌ ఎండ్‌ మోడ్‌ దగ్గర పడుతుండటంతో రిలీజ్‌కి రెడీ అవుతున్న సినిమా యూనిట్లు... ట్రిప్పులకు ప్లాన్‌ చేసుకుంటున్న స్టార్లు.. అనే తేడా లేకుండా అన్నీ లొకేషన్లు హడావిడిగా కనిపిస్తున్నాయి. పెరిగిన స్పీడుతో కళకళలాడుతోంది ఇండస్ట్రీ. ఇంతకీ మీ అభిమాన హీరోలు ఎక్కడ ల్యాండ్‌ అయ్యారో చూసేద్దాం పదండి.. షూటింగుల గురించి ప్రస్తావన వస్తే ముందు మాట్లాడుకోవాల్సింది డార్లింగ్‌ గురించే.

ఆయన ఫౌజీ మూవీ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మారుతి డైరక్షన్‌లో తెరకెక్కుతున్న రాజాసాబ్‌కి అజీజ్‌ నగర్‌లో తుదిమెరుగులు దిద్దుతున్నారు. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మన శంకర ప్రసాద్ గారు షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో స్పీడందుకుంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న మూవీని ముంబైలో చిత్రీకరిస్తున్నారు. నందదమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న అఖండ 2 సినియాకు గ్వాలియర్ లో తుదిమెరుగులు దిద్దుతున్నారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ చేస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో హలో నేటివ్‌ స్టూడియోలో జరుగుతోంది. శర్వానంద్‌ భోగి సెట్‌ వర్క్ కూడా హలో నేటివ్‌ స్టూడియోలో స్పీడందుకుంది. ప్రశాంత్ వర్మ నిర్మాతగా పూజ అపర్ణ కొల్లూరు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహా కాళి చిత్రం షూటింగ్‌ కూడా ఆ పరిసరాల్లోనే స్టార్ట్ అయింది. అల్యూమినియమ్‌ ఫ్యాక్టరీ అయితే వరుస షూటింగులతో కళకళలాడుతోంది. నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న సినిమా, విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ షూటింగులు అక్కడే జరుగుతున్నాయి. పవర్‌ స్టార్‌ కూడా ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ కోసం సేమ్‌ లొకేషన్‌కి ట్రావెల్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

థింక్‌ గ్లోబల్‌ అంటున్న జక్కన్న.. మహేష్‌ కోసం ఏం ప్లాన్‌ చేశారు

పాతవన్నీ థియేటర్లలో.. కొత్త సినిమాలు ఓటీటీల్లో

డార్లింగ్‌ ఇష్టపడుతుంటే.. యంగ్‌ టైగర్‌ వద్దనుకుంటున్నారా

ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి.. తల్లినే చంపింది

డిన్నర్‌ డేట్‌కి ముగ్గురు బిలియనీర్లు .. ఫొటోలు వైరల్‌