ట్రెండ్ మారింది..స్పెషల్ సాంగ్ ట్రెండూ మారింది

Edited By:

Updated on: Jan 25, 2026 | 9:38 PM

స్పెషల్ సాంగ్స్‌లో ట్రెండ్ మారింది. ఒకప్పుడు ప్రత్యేక హీరోయిన్లు చేసే పాటలు ఇప్పుడు స్టార్ హీరోయిన్లు చేస్తున్నారు. శ్రీయ నుండి సమంత వరకు, ఇప్పుడు శ్రీలీల, మృణాళ్ ఠాకూర్ వంటి ట్రెండింగ్ బ్యూటీస్ వైపు మేకర్స్ మొగ్గు చూపుతున్నారు. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ, ఈ జనరేషన్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌కు కొత్త మెరుపులు అద్దుతున్నారు. ఇది టాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్ భవిష్యత్తును పునర్నిర్మిస్తోంది.

స్పెషల్ సాంగ్స్ కోసం కూడా స్పెషల్‌గా ఆలోచిస్తున్నారు మన దర్శకులు. హీరోయిన్లతోనే ఆ పాటల్లో చిందేయిస్తున్నా.. అందులోనూ కొత్తగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ట్రెండింగ్‌లో ఉన్న బ్యూటీస్‌తోనే స్పెషల్ సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ కోసం ఓ క్రేజీ హీరోయిన్ స్పెషల్ బ్యూటీగా మారబోతుంది. మరి ఎవరా సుందరి..? ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కోసం సపరేట్ హీరోయిన్లు ఉండేవాళ్లు కానీ కొన్నేళ్ళుగా సీన్ మారిపోయింది. అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా ఉంటూ స్పెషల్ సాంగ్స్ చేసే ట్రెండ్ శ్రీయ స్టార్ట్ చేస్తే.. ఆ తర్వాత తమన్నా, పూజా, సమంత లాంటి నెక్ట్ జనరేషన్ స్టార్స్ స్పెషల్ సాంగ్స్ చేసారు. సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్.. కేవలం ఒకే పాటకు తీసుకున్నారు వాళ్లు. ట్రెండ్ మారింది.. అందుకే తమన్నా, సమంత, పూజా హెగ్డే కాకుండా ట్రెండింగ్‌లో ఉన్న శ్రీలీల, మృణాళ్ ఠాకూర్ లాంటి ఈ జనరేషన్ బ్యూటీస్ వైపు వెళ్తున్నారు మేకర్స్. ఆల్రెడీ శ్రీలీల పుష్ప 2లో కిసిక్ అంటూ దేశాన్ని ఊపు ఊపేసారు. ఇక పెద్దిలో జిగేల్ రాణి తరహాలో మాసీగా మృణాళ్ ఠాకూర్‌తో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు బుచ్చిబాబు. రష్మిక మందన్న సైతం స్పెషల్ సాంగ్స్‌కు ఓకే అంటున్నారు.. కాకపోతే అందులో హీరోయిన్ కూడా ఆమెనే అయ్యుండాలనేది కండీషన్. థామా, గుడ్ బై లాంటి సినిమాల్లో ఈ తరహా సాంగ్స్ చేసారు రష్మిక. బయటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్ చేయాలంటే.. ఇద్దరు ముగ్గురు దర్శకుల కోసం మాత్రమే చేస్తానన్నారు రష్మిక. వాళ్లెవరో టైమ్ వచ్చినపుడు చెప్తానంటున్నారు నేషనల్ క్రష్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చేజేతులా సినిమాలను నాశనం చేసుకుంటున్నారా

హిట్టు కోసం హిస్టరీ తవ్వుతున్న యాక్షన్ హీరో

సంక్రాంతి మంచి గుణపాఠం నేర్పిందిగా

NBK111 ముహూర్తం ఫిక్స్.. ఈసారి ప్లాన్ మామూలుగా లేదు

‘యాత్ర’ అయిపోంది.. ఇప్పుడు ‘పాదయాత్ర’ మొదలైంది

Published on: Jan 25, 2026 09:33 PM