యూరప్ లో ప్రభాస్ ది రాజాసాబ్ సాంగ్ షూట్

Updated on: Oct 15, 2025 | 6:27 PM

సెప్టెంబర్ సక్సెస్‌లు ఇచ్చిన కిక్‌తో అక్టోబర్‌లోనూ కనిపిస్తోంది. హిట్ జోష్‌లో వరుస షూటింగ్స్ చేస్తున్నారు స్టార్స్‌. నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు లొకేషన్‌లలో హీరోలు కూడా కష్టపడుతున్నారు. ఎవరో ఒకరిద్దరు మినహా.. ఏ హీరోను తీసుకున్నా ఆన్ సెట్స్‌లోనే బిజీగా ఉన్నారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దామా..? హలో నేటివ్ స్టూడియోలో రామ్ నటిస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకతో పాటు నాని ప్యారడైజ్ జరుగుతున్నాయి.

శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న భోగి సినిమా కోసం అక్కడే సెట్‌ సిద్ధం చేస్తున్నారు. ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న ది రాజాసాబ్‌ పాటల చిత్రీకరణ యూరప్‌లో జరుగుతోంది. మన శంకరవరప్రసాద్‌ గారు షూటింగ్‌ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో జరుగుతోంది. ఆల్రెడీ పవన్ పోర్షన్ పూర్తి చేసిన హరీష్ శంకర్‌, ఉస్తాద్‌ భగత్‌ సింగ్ మిగతా షూటింగ్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో కంప్లీట్ చేస్తున్నారు. మహేష్‌, రాజామౌళి SSMB29 షూటింగ్ RFCలో జరుగుతున్నాయి. అల్లు అర్జున్‌, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న ఎన్‌సీ 24 షూటింగ్‌లో పాల్గొంటున్నారు నాగచైతన్య. విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ సినిమా షూట్ కూడా అక్కడే జరుగుతుంది. ప్రశాంత్ వర్మ నిర్మాతగా పూజ అపర్ణ కొల్లూరు తెరకెక్కిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం మహాకాళి షూటింగ్ ముచ్చింతల్‌లో జరుగుతోంది. అఖిల్ అక్కినేని లెనిన్‌ షూటింగ్‌ భూత్‌ బంగ్లాలో జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ విషయం లో పవన్‌ను ఫాలో అవుతున్న మలయాళ స్టార్‌

అందాల భామల టాలీవుడ్ రీఎంట్రీ.. సెకండ్ ఛాన్స్ తో అయిన సత్తా చూపుతారా

పాన్ ఇండియా ట్రెండ్ లో పెరిగిన గ్రాఫిక్స్ వాడకం

NTR మరో మైల్‌స్టోన్ సెట్ చేస్తారా..?

అనుమానాలకు చెక్‌ పెడుతూ.. బరిలోకి దిగనున్న వెంకీ..