300 ఫోక్ సాంగ్స్.. ఇప్పుడు హీరోయిన్ !! నాగ దుర్గ ఎక్కడికో వెళ్లిందిగా..

Updated on: Dec 19, 2025 | 5:31 PM

తెలంగాణ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను ఏలుతున్నాయి. నాగదుర్గ నటించిన 'పెరుగల్ల పెద్దిరెడ్డి' పాట యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. కూచిపూడి నుండి జానపద డ్యాన్సర్‌గా ఎదిగిన నాగదుర్గ, ఇప్పుడు హీరోయిన్‌గా మారింది. పాటల ఎంపికలో లిరిక్స్, మ్యూజిక్‌కు ప్రాధాన్యత ఇస్తూ, తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆమె ప్రయాణం, విజయాలు ఇప్పుడు హాట్ టాపిక్.

ప్రస్తుతం తెలంగాణ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను ఏలేస్తున్నాయి. ఇప్పుడు యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతున్న పాటల్లో పేరుగల్ల పెద్దిరెడ్డి ఒకటి. ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ నటించిన ఈ పాట ఇప్పుడు నెట్టింట దూసుకుపోతోంది. బుల్లెట్టు బండి ఫేమ్ బండి లక్ష్మణ్ రాసిన ఈ పాట ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. ఓ తండ్రిపై కూతురు చూపించే ప్రేమను నేపథ్యంగా అద్భుతంగా లిరిక్స్ రాశారు బుల్లెట్ బండి ఫేం లక్ష్మణ్. ఇప్పుడు ఈ పాట మిలియన్ వ్యూస్ తో దుమ్మురేపుతంది. ఈపాటను మమత రమేశ్ పాడగా.. మదన్ కే మ్యూజిక్ అందించారు. పచ్చని పొలాల మధ్యలో అందమైన ప్రకృతితో ఈ పాటను మరింత అందంగా తెరకెక్కించారు. ఇందులో నాగదుర్గ లుక్స్, డ్యాన్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం యూట్యూబ్ సెన్సేషన్ నాగదుర్గ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగదుర్గ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కూచిపూడితో తన నృత్య ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత జానపద డ్యాన్సర్ గా మారిన నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్ గా మారింది. పాటల ఎంపికలో లిరిక్స్, మ్యూజిక్‌కు ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన నాగ దుర్గ.. కుటుంబ సభ్యుల సలహాలను కూడా తీసుకుంటా అన్నారు. నాలుగు సంవత్సరాల తన ప్రయాణంలో సుమారు 300 పాటలు చేశానని, ప్రతి పాటకు ప్రత్యేకత చూపించడానికి కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, డాన్స్‌లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తానన్నారు. విమర్శలను పట్టించుకోకుండా, సానుకూల వ్యక్తులతోనే తన సర్కిల్‌ను పరిమితం చేసుకుంటానని నాగదుర్గ చెప్పారు. తాను చేసిన కొన్ని పాటలు పెద్ద హిట్ అయ్యాయని, అలాగే తాను చేసిన పాటల విజయానికి ప్రధాన కారణం పాటలోని లిరిక్స్, మ్యూజిక్ అని, తన నృత్యం దానికి అదనపు బలంగా మాత్రమే ఉంటుందన్నారు ఆమె. రెమ్యూనరేషన్ విషయంలో కూడా తన కెరీర్ మొదట్లో తీసుకున్న దానికి ఇప్పుడు తేడా ఉందని, తన బ్రాండ్ వాల్యూ పెరిగిందని అన్నారు. పాట నచ్చితే రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటానని నాగదుర్గ చెప్పుకొచ్చారు. అంతేకాదు సాయి పల్లవితో తనను పోల్చడం పై సంతోషం వ్యక్తం చేశారు ఆమె. ప్రస్తుతం నాగ దుర్గ హీరోయిన్‌గా బంపర్ ఛాన్స్ కొట్టేశారు. జాబిలమ్మ నీకు అంత కోపమా ఫేమ్‌.. పవిష్‌ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. దీంతో ఈమె ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Abhi: ప్రభాస్ పక్కన నటిస్తే.. 11 వేలు ఇచ్చారు! అభి కామెంట్స్!

ఎన్‌పీఎస్‌లో కీలక మార్పు రూ.8 లక్షలు విత్ డ్రా

ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం

మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ.. ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?

టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ