Tamannaah Bhatia: ఏజ్ బార్ ఇష్యూ గురించి మాట్లాడిన తమన్నా

Edited By: Phani CH

Updated on: Nov 01, 2025 | 9:15 AM

తమన్నా మా పొట్టకొడుతోంది.. స్పెషల్‌ సాంగులన్నీ ఆమె ఎగరేసుకుపోతే మా బతుకుతెరువు ఏమైపోవాలి అని ఈ మధ్య రాఖీసావంత్‌ ఘాటుగా మాట్లాడిన విషయం మన చెవిన కూడా పడింది. అయితే అదేమీ పట్టనట్టు ఇండస్ట్రీలో ఉన్న అవకాశాల గురించి పాజిటివ్‌గా స్పందించేశారు తమన్నా భాటియా. ఇంతకీ మన మిల్కీబ్యూటీ ఏమన్నారు? చూసేద్దాం వచ్చేయండి.

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడంలో ఓ గర్వం ఉంటుంది. అదే 30ఏళ్లున్న హీరోయిన్లకు ఉన్న అవకాశాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే బిక్కు బిక్కు మంటుంది… అన్నది పరిశ్రమలో తరచూ వినిపించే మాట. అయితే ఇక అలాంటి డౌట్స్ అక్కర్లేదంటున్నారు తమన్నా భాటియా. డోంట్‌ వర్రీ.. బీ హ్యాపీ అని తాను గమనించిన విషయాలను షేర్‌ చేసుకుంటున్నారు. నటించాలన్న ఆసక్తి ఉంటే చాలు.. ఏజ్‌తో సంబందం లేకుండా కెరీర్‌ని డెవలప్‌ చేసుకోవచ్చన్నది తమన్నా చెబుతున్న మాట. నేటి తరం దర్శకులు హీరోయిన్ల ఏజ్‌ని దృష్టిలో పెట్టుకునే పాత్రలు రాస్తున్నారంటున్నారు ఈ లేడీ. తాను థర్టీస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టైమ్‌లోనే సరిగ్గా ఇలాంటి మార్పు ఇండస్ట్రీలో చోటుచేసుకోవడం ప్యూర్‌గా లక్‌ అనే అన్నారు తమన్నా. వయసు పెరగడాన్ని చాలా మంది వ్యాధిలా భావిస్తున్నారని, వయసు పెరగడం అనేది అద్భుతమైన విషయమనీ తెలిపారు. ఏజ్‌ విషయం గురించి తానెప్పుడూ బాధపడలేదంటున్నారు మిల్కీ బ్యూటీ. ఏజ్‌తో సంబంధం లేకుండా హీరోయిన్లు స్క్రీన్‌ మీద గ్రేస్‌ చూపిస్తుంటే చూడ్డానికి ముచ్చటగా ఉందన్నారు. ఒకప్పటిలా హీరోయిన్‌ అనగానే టీనేజర్స్ ని జనాలు కూడా ఎక్స్ పెక్ట్ చేయడం లేదని, ఏజ్‌కి తగ్గ కథలకు వెల్కమ్‌ చెబుతున్నారనీ అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shah Rukh Khan: ఆసక్తికరంగా మారిన షారుఖ్ – సిద్ధార్థ్ డిస్కషన్

Sukumar: రంగస్థలం సినిమాకి సుకుమార్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా

సడన్ గా వెలుగులోకి వచ్చిన హీరోయిన్లు

Dulquer Salmaan: దుల్కర్ సెంటిమెంట్.. కాంతకు కలిసొస్తుందా ??

ఎవరెస్ట్‌ శిఖరంపై కుప్పకూలిన హెలికాఫ్టర్‌