Tamannaah Bhatia: అడ్వెంచర్ రోల్స్ కావాలంటున్న తమన్నా
20 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశారు తమన్నా.. ఆమె చేయని పాత్రలు లేవు.. ట్రై చేయని జోనర్ లేదు.. వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారిప్పుడు. స్టార్స్ అందరినీ కవర్ చేసారు. అన్ని చేసినా కూడా ఒక్క కల మాత్రం తనకి అలాగే ఉండిపోయిందంటున్నారు మిల్కీ బ్యూటీ. మరి తమన్నా కోరుకుంటున్న ఆ డ్రీమ్ రోల్ ఏంటి..? తమన్నా భాటియా.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు.
తెలుగు టూ తమిళం వయా హిందీ అన్నట్లు ఉంటుంది ఈమె కెరీర్. అన్నిచోట్లా జెండా పాతేసారు. 20 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిపోయారు మిల్కీ బ్యూటీ. ముఖ్యంగా బాలీవుడ్‌లో తమన్నాకు డిమాండ్ మామూలుగా లేదిప్పుడు. ఓవైపు హీరోయిన్‌గా నటిస్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్స్ చేయడం తమన్నా స్పెషల్. అంతేకాదు.. తమన్నా తమ సినిమాలో చిందేస్తే సినిమా హిట్ అని నమ్ముతుంటారు మేకర్స్. రైడ్ 2, స్త్రీ 2 ఇలా చాలా వరకు తమన్నా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన సినిమాలు కాసులు కురిపించడంతో ఈ సెంటిమెంట్ మరింత బలపడింది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసారు తమన్నా.. ఇప్పుడు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. యాక్షన్, కామెడీ, హిస్టారికల్, హార్రర్.. అన్ని జోనర్స్ ఆల్‌మోస్ట్ టచ్ చేసారు మిల్కీ బ్యూటీ. ఇన్ని చేసిన తనకు అడ్వంచరస్ రోల్ చేయాలనే కోరిక మాత్రం అలాగే ఉండిపోయిందంటున్నారు ఈ సీనియర్ హీరోయిన్. ఇప్పటి వరకు ఆ రోల్ తనకెవరూ ఆఫర్ చేయలేదన్నారు ఈమె. ఇండియన్ సినిమాలో హీరోయిన్లతో అడ్వంచరస్ రోల్స్ ఎవరూ పెద్దగా ఎక్స్‌ప్లోర్ చేయలేదని.. తనకు అలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టారు తమన్నా. బాహుబలిలో యాక్షన్ సీక్వెన్స్‌లు అదరగొట్టిన తమన్నాకు పూర్తిస్థాయి అడ్వంచరస్ రోల్ చేసే ఆఫర్ ఇచ్చే ఆ దర్శకుడెవరో చూడాలిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వానాకాలానికి.. నో ఎండ్ వచ్చే రెండ్రోజులూ వానలే
జియో మరో సంచలనం.. రూ.799లకే సేఫ్టీ ఫోన్లు..విద్యార్థులకు ఫ్రీగా ఏఐ కోర్సు
షోరూం ముందే స్కూటీని తగలబెట్టిన యజమాని.. కారణం ఇదే..
Viral Video: బంగారంతో చేసిన అదిరేటి డ్రెస్ ధరించిన యువతి.. ధర తెలిస్తే దడే
Madhya Pradesh: ఓరి బుడ్డోడా.. లక్ అంటే నీదే.. రూ.200లతో 53 లక్షలు కొట్టేశావ్
