Rajinikanth: ‘ఎన్ని ఉన్నా.. అనాథలానే అనిపిస్తుంది’
సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇటీవల ఏవీఎం ప్రొడ్యూసర్ శరవణన్ చిత్రపట ఆవిష్కరణలో భావోద్వేగానికి లోనయ్యారు. తమ 11 సినిమాల ప్రయాణాన్ని, వ్యక్తిగత స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. వయసు పెరిగేకొద్దీ బిజీగా ఉండాలనే శరవణన్ సలహాను ఇప్పటికీ పాటిస్తున్నానని రజినీ తెలిపారు. నచ్చినవారు దూరమైతే అనాథలుగా మిగిలిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మధ్య సూపర్ స్టార్ రజినీ కాంత్ తరుచుగా కాస్త ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారు. ఇటీవల మరణించిన ఏవీఎం ప్రొడ్యూసర్ శరవణన్ చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమంలోనూ రజినీ ఎమోషనల్ అయ్యారు. శరవణన్‌తో కలిసి తాను 11 సినిమాలు చేశానని, యక్తిగతంగానూ శరవణన్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అన్నారు రజనీ. ఏజ్ పెరిగేకొద్దీ మరింత బిజీగా ఉండాలని … శివాజీ సినిమా తర్వాత శరవణన్ తనకు సలహా ఇచ్చారని రజనీ గుర్తుచేసుకున్నారు. కనీసం ఏడాదికో సినిమా అయినా చేయమని సూచించారని.. ఇప్పటికీ తాను ఆ సలహా పాటిస్తున్నానంటూ రజినీ చెప్పారు. ‘మనకు నచ్చినవారిని కాలం తనకు నచ్చినప్పుడు తీసుకెళ్లిపోతుంది. మనకు ఎంత డబ్బు, హోదా ఉన్నా.. మనకు నచ్చిన మనుషులు మరణించాక మనం అనాథగా మిగిలాల్సిందేనా అనిపిస్తుంది’ అంటూ శరవణన్‌ను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajeev Kanakala: అవకాశాలు రావడం లేదుకానీ.. వస్తే తరుణ్‌కు తిరుగే ఉండదు
Chandrabose: నలభై రూపాయల పుస్తకానికి.. 40 లక్షలు.. చంద్రబోస్ తుంటరి పనితో.. ఊరికి మేలు
RGV: ‘ఆర్జీవీని సైకో అన్నారు..అందుకే భయపడ్డా’ కానీ.. ఆ తర్వాత
Poonam Kaur: పెళ్లి.. అబార్షన్.. నా లైఫ్ గురించి సోషల్ మీడియాలో
