Mem Famous: మేమ్ ఫేమస్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూసేయండి

Mem Famous: మేమ్ ఫేమస్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూసేయండి

Phani CH

|

Updated on: May 26, 2023 | 9:09 PM

టాలీవుడ్ సెలబ్రిటీస్తో.. డిఫరెంట్ ప్రమోషనల్‌ వీడియోస్‌తో.. సూపర్ డూపర్ హైప్ తెచ్చుకున్న మేం ఫేమస్‌ మూవీ తాజాగా రిలీజ్ అయింది. సూపర్ స్టార్ మహేష్‌కు.. కూడా విపరీతంగా నచ్చేసిన ఈ మూవీ ఎలా ఉంది? మనకు కూడా కిక్కిస్తుందా? లేదా? తెలియాలంటే.. గీ రివ్యూ చూసేయండి.

టాలీవుడ్ సెలబ్రిటీస్తో.. డిఫరెంట్ ప్రమోషనల్‌ వీడియోస్‌తో.. సూపర్ డూపర్ హైప్ తెచ్చుకున్న మేం ఫేమస్‌ మూవీ తాజాగా రిలీజ్ అయింది. సూపర్ స్టార్ మహేష్‌కు.. కూడా విపరీతంగా నచ్చేసిన ఈ మూవీ ఎలా ఉంది? మనకు కూడా కిక్కిస్తుందా? లేదా? తెలియాలంటే.. గీ రివ్యూ చూసేయండి. బండ‌న‌ర్సంప‌ల్లి ఊళ్ళో ఉండే ముగ్గురు స్నేహితుల కథే మేం ఫేమస్ సినిమా.! మ‌హేష్.., మై అలియాస్ సుమంత్ ప్ర‌భాస్, దుర్గ అలియాస్ మ‌ణి ఎగుర్ల‌, బాల‌కృష్ణ అలియాస్ మౌర్య‌ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. అలాగే పనీ పాట లేకుండా ఊరి మీద పడి బలాదూర్‌గా తిరగడం.. ఏదో ఓ తిక్క పని చేసి అందరితో చివాట్లు తినడమే వాళ్ల పని. ఇలాంటి వారిని ఊరోళ్లంతా తిడుతుండడంతో.. కనపడిన ప్రతీ ఒక్కరూ నిలదీస్తుండడంతో.. అందరూ కలిసి ఓ బిజినెస్ పెడతారు.. మంచి లాభాలు వస్తున్న క్రమంలోనే అప్పుల పాలవుతారు. ఇక ఈ అప్పు ఎలా తీర్చాలనే బాధలోనే ఉండగా.. మై ప్రాణంగా ప్రేమించిన మౌనిక అలియాస్ సార్య ల‌క్ష్మ‌ణ్‌, బాల ప్రాణంగా ప్రేమించిన బబ్బీ అలియాస్ సిరా రాశీ తో విడిపోయే పరిస్థితి వస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో వీరందరేం చేశారు. ఫేమస్ అవ్వడానికి మళ్లీ ఎలాంటి దారి ఎంచుకున్నారు అనేది మిగిలిన కథ..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొద్దిలో తప్పించుకున్నాడు కానీ.. షార్క్ నోట్లో కిళ్లీ పాన్ అయ్యేవాడు..

కుక్కలకు భయపడిన చిరుత.. ఎక్కడ దాకుందో మీరే చూడండి

వధూవరులు డ్యాన్స్ చేయాలని.. మండపంలో చితక్కొట్టేసుకున్న ఇరు కుటుంబాలు

ప్రపంచంలోని వృద్ధ శునకం !! వయసెంతో తెలుసా ??

వంద రోజుల పాటు నీటి అడుగునే నివాసం.. న్యూ రికార్డ్..