మూడు రోజులుగా ఆసుపత్రిలో… అయినా మాట కోసం బయటికి వచ్చిన సుధీర్

Updated on: Feb 19, 2025 | 6:09 PM

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. తన కామెడీ పంచులు, ప్రాసలు, యాక్టింగ్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు సుధీర్. ఇక యాంకర్ గానూ రాణిస్తూ స్టార్ హీరోలకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెరపై పలు టీవీ షోస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తూనే సినిమాల్లో నటిస్తున్నాడు.

సోలో హీరోగా యాక్ట్ చేస్తూనే ఇతర హీరోల సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ కూడా మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ ధన రాజ్ డైరెక్టోరియల్ ఫిల్మ్ రామం రాఘవం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌ గా వచ్చిన సుధీర్.. కాస్త బక్క చిక్కినట్టు చాలా నీరసంగా కనిపించాడు. తన లుక్‌తో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాడు. తన లుక్‌పై ఫ్యాన్స్ ఆరా తీసేలా కూడా చేసుకుంటున్నాడు. అయితే ఇదే ఈవెంట్లో రామం రాఘవం డైరెక్టర్ ధన్ రాజ్‌ సుడిగాలి ఆరోగ్యం గురించి అసలు విషయం చెప్పాడు. సుధీర్ కి ఆరోగ్యం బాగోలేదని.. నేరుగా ఆస్పత్రి నుంచి తన కోసం వచ్చాడంటూ ఎమోషనల్ అయ్యాడు. అంతేకాదు మూడు రోజుల నుంచి సుధీర్‌ అసలు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని.. అయినా తన కోసం వస్తున్నా అంటూ చెప్పాడు కాబట్టే ఈ ఈవెంట్‌కు వచ్చాడంటూ చెప్పాడు ధన్ రాజ్‌. తాను బాగుండాలని కోరుకున్న వాళ్ళల్లో సుధీర్ కూడా ముందుంటాడని.. ఎమోషనల్ అయ్యాడు ధన్ రాజ్. ఆ తర్వాత సుధీర్‌కు చాలా మొహమాటమని చెప్పిన ఈయన.. ఆఖరికి అతని ఫంక్షన్స్ కు కూడా వెళ్లడానికి సుధీర్ ఆలోచిస్తాడంటూ.. ఫన్నీ కామెంట్స్ చేశాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విడాకుల ఖరీదు రూ.60 కోట్లు..! పాపం క్రికెటర్ !