Netflix: నెట్ ఫ్లిక్స్ సైట్ క్రాష్.. అట్లుంటది.. మనోళ్ల దెబ్బ
స్ట్రేంజర్ థింగ్స్ 5 ఫైనల్ ఎపిసోడ్ విడుదలైనప్పుడు, నెట్‌ఫ్లిక్స్ సర్వర్ క్రాష్ అయింది. డిసెంబర్ 31న 'ది రైట్‌సైడ్ అప్' స్ట్రీమింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా వీక్షకులు ఒక్కసారిగా ఎగబడటంతో, ప్లాట్‌ఫారమ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా, చాలా మంది అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ఇప్పటికీ సమస్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన స్ట్రేంజర్ థింగ్స్ ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది.
ఆలోవర్ వరల్డ్ ఇప్పటి వరకు ఉన్న సిరీసుల్లో.. వన్ ఆఫ్ ది టాప్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్. నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీసుల్లో ఇప్పటి వరకు కంప్లీట్‌గా 4 సిరీస్‌లు బయటికి వచ్చాయి. అయితే ఐదవ సిరీస్ మాత్రం ఎపిసోడ్స్ వారిగా బయటికి వస్తోంది. స్ట్రేంజర్ థింగ్స్ 5 లోని ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ నవంబర్ 26న స్ట్రీమింగ్‌కు రాగా.. 5th,6th,7th ఎపిసోడ్స్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా ఫైనల్ ఎపిసోడ్.. ఎపిసోడ్ 8th డిసెంబర్ 31న స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఫైనల్ ఎపిసోడ్‌ను చూసేందుకు నెట్‌ఫ్లిక్స్ పైకి అందరూ ఒక్క సారిగా ఎగబడడంతో.. దెబ్బకు ఈ ఓటీటీ జెయింట్ కాస్తా క్రాష్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఎక్కడో అక్కడ.. ఈ సీరిస్ స్ట్రీమింగ్ ఎర్రర్ చూపిండం.. ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఎస్ ! న్యూ ఇయర్ కానుకగా స్ట్రేంజర్ థింగ్స్ 5 ఫైనల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ‘ది రైట్‌సైడ్ అప్’ పేరుతో ఎనిమిదో ఎపిసోడ్ రాగానే నెట్‌ఫ్లిక్స్ సర్వర్ క్రాష్ అయింది. ఫైనల్ ఎపిసోడ్ స్ట్రీమ్ అయిన వెంటనే, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వీక్షకులు ఒక్కసారిగా నెట్‌ఫ్లిక్స్‌పై పడ్డారు. దీంతో అకస్మాత్తుగా ఈ OTT ప్లాట్‌ఫామ్ సర్వర్లు క్రాష్ అయ్యాయి. మీడియా నివేదికల ప్రకారం, దాదాపు ఒక నిమిషం పాటు నెట్ ఫ్లిక్స్ లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ సమయంలో యూజర్ల స్క్రీన్‌లపై ఎర్రర్ మెసేజ్ వచ్చింది. దాంతో పాటే నెట్ ఫ్లిక్స్ నుంచి ‘తప్పు జరిగింది. క్షమించండి. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. అప్పటి వరకు, మీరు హోమ్ పేజీలో ఇతర సినిమాలు, సిరీస్ లను చూడవచ్చు’ అంటూ నెట్‌ఫ్లిక్స్ నుంచి మరో మెసేజ్ డిస్‌ప్లే అయింది. దీంతో స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ అందరూ నెట్ ఫ్లిక్స్ పై అసహనం వ్యక్తం చేశారు. ముందే చూసుకోవాలిగా అంటూ నెట్ ఫ్లిక్స్ ను విమర్శించారు. అయితే ఆ ఎర్రర్ మెసేజ్ ఇప్పటికీ కొందరికి కనిపిస్తుండడంతో.. నెట్ ఫ్లిక్స్ ఇంకా ఈ ఇష్యూతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mamitha Baiju: మమితమ్మ దెబ్బకు.. జన నాయగన్ పై ట్రోల్స్
The Raja Saab Review: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదే! రాజాసాబ్
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్ విజ్ఞప్తి
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
