ఏలియన్ల “ఏరియా 51′ గుట్టు విప్పే సినిమా ??

Updated on: Dec 20, 2025 | 7:35 PM

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ తన కొత్త చిత్రం 'డిస్‌క్లోజర్ డే'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో గ్రహాంతరవాసులు (ఏలియన్స్) మరియు ఏరియా 51 రహస్యాలను స్పీల్‌బర్గ్ వెల్లడిస్తారని తెలుస్తోంది. విశ్వంలో మనం ఒంటరిగా లేమన్న వాస్తవాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేయనున్నారు. జూన్ 12, 2026న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

భూగ్రహంపై మనుషులు ఉన్నట్లే… ఇతర గ్రహాలపైనా ఎవరో ఒకరు ఉంటారని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. అమెరికా ఎదుగుదలలో ఏలియన్స్‌ హస్తం ఉందంటూ ఇప్పటికే చాలా వార్తలొచ్చాయి. అధ్యక్షుడు ట్రంప్‌ ఏలియన్స్‌ని కలిసారని వారితో మంచి ఫ్రెండ్‌షిప్‌ కూడా ఉందన్న వార్తలు వైరల్‌ అయ్యాయి. గట్టి భద్రత ఉన్న ఏరియా 51లో అమెరికా ఏలియన్స్‌ ని బంధించిందని అక్కడ నుంచే ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థను ఏలియన్స్‌ ద్వారా అమెరికా తెలుసుకుంటుందన్న టాక్‌ కూడా ఉంది. అయితే నిజానికి ఏరియా 51లో ఏం ఉంది..? అందులో నిజంగానే ఏలియన్స్‌ ఉన్నాయా? హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ చాలా కాలం తర్వాత తనకిష్టమైన ఏలియన్స్‌ కథను సైన్స్ ఫిక్షన్ జానర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ విశ్వంలో మనం ఒంటరిగా లేమని ఏలియన్స్‌ రహస్యాలను ఈ చిత్రంలో బయటపెడతానని స్పీల్‌బర్గ్ రివీల్‌ చేసారు. “ఈ సువిశాల విశ్వంలో మేధస్సు ఉన్న ఏకైక జీవులు మనమే కావడం గణితశాస్త్రపరంగా అసాధ్యం” అని ఆయన వ్యాఖ్యానించారు. సినిమాలో ఏలియన్స్‌ను కిడ్నాప్‌ చేసి ఏరియా 51లో అమెరికా దాచినట్లు వార్తలొచ్చాయి. ఏరియా 51 మిస్టరీ పైనే స్పీల్‌బెర్గ్‌ సినిమా ఉండనుందని ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ‘డిస్‌క్లోజర్ డే’ సినిమాను 2026 జూన్ 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్‌లో వాతావరణ వార్తలు చదువుతున్న ఎమిలీ బ్లంట్ పాత్రను ఓ గ్రహాంతర శక్తి ఆవహిస్తుంది. “నిజం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. అది ఏడు బిలియన్ల మందికి చెందింది” అనే డైలాగ్ సినిమా కథాంశాన్ని సూచిస్తుంది. ‘జురాసిక్ పార్క్’ కి పనిచేసిన రచయిత డేవిడ్ కోప్‌తో స్పీల్‌బర్గ్ ఈ సినిమా కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో ‘క్లోజ్ ఎన్‌కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’, ‘E.T’ వంటి చిత్రాలతో ఏలియన్ల కథలకు కొత్త నిర్వచనం ఇచ్చిన 78 ఏళ్ల స్పీల్‌బర్గ్, ఇప్పుడు ‘డిస్‌క్లోజర్ డే’తో మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్‌ మహిళ

Samantha: సమంత న్యూ ఇయర్ రిజల్యూషన్ పోస్ట్‌ వైరల్‌.. తప్పులు దిద్దుకుంటా

Himalayas: మంచు లేక బోసిపోయిన హిమాలయాలు

ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే

గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..