దర్శకులుగా మారుతున్న స్టార్ వారసులు
సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ వారసులు హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతారు. అయితే, ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్‌లలో కొందరు స్టార్ పిల్లలు దర్శకత్వ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. సూర్య కుమార్తె దియా సూర్య డాక్యుమెంటరీతో, విజయ్ తనయుడు జాసన్ సంజయ్ సందీప్ కిషన్ హీరోగా తన తొలి చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.
సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ రేంజ్‌లో ఉన్నవారు తమ వారసుల్ని నటీనటులుగానే పరిచయం చేయాలనుకుంటారు. అయితే, ప్రస్తుతం కొందరు అగ్ర తారలు ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తున్నారు. వారి వారసులు దర్శకులుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇది భారతీయ సినీ పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కుటుంబం నుంచి కొత్త తరం సిల్వర్ స్క్రీన్‌పైకి వస్తోంది. సూర్య కుమార్తె దియా సూర్య ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. అమ్మానాన్నలిద్దరూ నటులైనప్పటికీ, దియా మాత్రం దర్శకురాలిగా తన తొలి ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఆమె తన మొదటి ప్రాజెక్ట్‌తోనే ఆస్కార్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
వైరల్ వీడియోలు
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు

