స్టార్ హీరోలకు తప్పని లీకుల కష్టాలు.. ఈ సమస్యకు చర్యలు తప్పనిసరి అంటున్న మేకర్స్

Edited By: Phani CH

Updated on: Oct 14, 2025 | 6:42 PM

ప్రెస్టీజియస్ చిత్రాల లీకులతో స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభాస్ ది రాజాసాబ్ లుక్, టీజర్, సాంగ్ క్లిప్‌లు లీక్ అయ్యాయి. చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా, రాజమౌళి SSMB29కి సంబంధించిన మహేష్ లుక్ కూడా లీకైంది. ఈ సమస్యకు మేకర్స్ లీగల్ చర్యల ద్వారానే పరిష్కారం చూస్తున్నారు.

అభిమానుల అతి ఉత్సాహం స్టార్ హీరోలకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలకు సంబంధించిన వీడియో లీక్‌లు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి. అధికారిక విడుదల వరకు సమాచారాన్ని దాచిపెట్టాలని మేకర్స్ ప్రయత్నించినా అది సాధ్యపడటం లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ చిత్ర బృందాన్ని లీకుల బెడద వెంటాడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎంత గోప్యంగా ఉంచాలనుకున్నా ముందే లీక్ అయింది. టీజర్ విషయంలో కూడా యూనిట్‌కు పెద్ద షాక్ తగిలింది. చెప్పిన సమయం కన్నా ముందే ది రాజాసాబ్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా విదేశాల్లో జరుగుతున్న సాంగ్ షూట్‌కు సంబంధించిన క్లిప్ కూడా వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన రుక్మిణీ వసంత్

ప్లాన్ ఇంటర్నేషనల్ అంటున్న రాజమౌళి.. ఇక బాక్సులు బద్దలవ్వాల్సిందే

2026కి గట్టిగ ప్లాన్ చేసిన ప్రభాస్.. టార్గెట్ 1000 కోట్లు

Samantha: పూజలో సమంత పక్కన కూర్చున్నదెవరు ??

ఈ ఏడాది టాప్ గ్రాసర్‌గా అఖండ2 నిలుస్తుందా ??

Published on: Oct 14, 2025 06:42 PM