SSMB29: అత్యంత దుష్ట, క్రూర,శక్తివంతమైన నా విలన్‌ ఇతడే..

Updated on: Nov 09, 2025 | 4:54 PM

రాజమౌళి-మహేష్‌ బాబుల SSMB29లో విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నట్లు జక్కన్న ప్రకటించారు. పృథ్వీరాజ్ క్యారెక్టర్ పేరు 'కుంభ' అని, స్టీఫెన్ హాకింగ్ ప్రేరణతో దీన్ని రూపొందించినట్లు తెలిపారు. అతని అద్భుత నటనను రాజమౌళి ప్రశంసించారు. నవంబర్ 15న SSMB29 టైటిల్, మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

SSMB 29 వర్కింగ్‌ టైటిల్‌తో.. మహేష్‌ హీరోగా.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబల్‌ టార్టర్‌ మూవీ నుంచి ఇప్పుడో సర్‌ప్రైజ్‌ బయటికి వచ్చింది. ఈ మూవీలో విలన్‌గా పృథ్వీ రాజ్ సుకుమారన్‌ నటిస్తున్నారని అఫీషియల్‌గా కన్ఫర్మ్‌ చేసిన జక్కన్న ఆయనకు సంబంధించిన అఫీషియల్ లుక్‌ను రిలీజ్ చేశాడు. దాంతో పాటే ఆయన క్యారెక్టర్ నేమ్ కుంభాగా రివీల్ చేశాడు జక్కన్న. అంతేకాదు తన సినిమాలోని అంటాగోనిస్ట్‌ క్యారెక్టర్‌ను పృథ్వీ రాజ్‌ అద్భుతంగా పోషించాడంటూ మెచ్చుకున్నాడు. పృథ్వీతో మొదటి షాట్ చిత్రీకరించిన తర్వాత నేరుగా తన దగ్గరికి వెళ్లి.. మీరు నాకు తెలిసిన అత్యుత్తమ నటులలో ఒకరు అని చెప్పానంటూ తన చేసిన పోస్ట్‌లో రాసుకొచ్చాడు జక్కన్న. అంతేకాదు దుష్ట, క్రూర.. శక్తివంతమైన విలన్‌గా కుంభకు పృథ్వీ ప్రాణం పోయడం తనకు చాలా సంతృప్తినిచ్చిందటూ తన పోస్టులో రాసుకొచ్చాడు. ఇక ప్రస్తుతం విడుదలైన పోస్టర్ చూస్తుంటే SSMB29లో పృథ్వీరాజ్ సరికొత్త పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఒక వీల్ చైర్ లో కూర్చుని రోబో సాయంతో ఒక భారీ పైట్ సీన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను ప్రేరణగా తీసుకుని ఈపాత్రను డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయం కాసేపు పక్కకు పెడితే… SSMB29 సినిమా టైటిల్ తోపాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ఈనెల 15న రిలీజ్ చేయనున్నారు జక్కన్న. ఇందుకోసం నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుక నిర్వహించనున్నట్లు చెప్పాడు.చెప్పడమే కాదు.. ఇప్పటికే భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు ఈ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ .

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అతను జర్నలిస్టు కాదు..! సీరియస్‌ కామెంట్స్ చేసిన హీరోయిన్

తనూజ, దివ్య మధ్య పోరుతో భరణి బేజారు

TOP 9 ET News: ఆ ప్రాజెక్ట్ సెట్టు అయితే అందనంత ఎత్తుకు అల్లు అర్జున్

రీసెంట్ టైమ్స్‌లో బాగా భయపెట్టే సినిమా ఇదే! హిట్టా..? ఫట్టా..?

రాజ్ నిడిమోరుకు సమంత క్లోజ్ హగ్ కొత్త ప్రయాణం మొదలైందా