Srivalli Song: శ్రీవ‌ల్లి హూక్ స్టెప్‌ను అచ్చుగుద్దిన‌ట్టు దింపేసిన త‌ల్లీకూతురు..(Video)

|

Feb 19, 2022 | 9:27 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప.. ది రైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ సామాన్యుల నుంచి సెలబ్రేటిలవరకూ అందరినీ ఆకట్టుకున్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప.. ది రైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ సామాన్యుల నుంచి సెలబ్రేటిలవరకూ అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే.. చిన్న పెద్ద, ఆడ, మగ, అనే తేడా లేకుండా ఈ సినిమాలోని సన్నివేశాలను ఇమిటేట్ చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు విదేశీ సెల‌బ్రిటీలు పుష్ప సినిమాలోని సాంగ్స్‌కు డ్యాన్స్ చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలు కూడా వైర‌ల్ అయ్యాయి.

తాజాగా శ్రీవ‌ల్లి సాంగ్‌లోని హూక్ స్టెప్పును అచ్చుగుద్దిన‌ట్టు దింపేశారు.. ఈ త‌ల్లీకూతురు . శ్రీవ‌ల్లి సాంగ్‌కు అద్భుతంగా డ్యాన్స్ చేసి వావ్ అనిపించారు. నివేదిత శెట్టి, త‌న కూతురు ఇష్వానీ హెగ్దే ఇద్ద‌రూ ఈ పాటకు డ్యాన్స్ వేసి ఆ వీడియోను నివేదిత త‌న ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియోను చూసి నెటిజ‌న్లు సూప‌ర్బ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాళ్లిద్దరూ క‌ల‌సి ఇలా చాలా పాట‌ల‌కు డ్యాన్స్ వేసి అద‌ర‌గొట్టేశారు. ప్ర‌స్తుతం శ్రీవ‌ల్లి ఫీవ‌ర్ న‌డుస్తుండ‌టంతో ఆ పాట‌కు డ్యాన్స్ వేసి సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నారు.