Sreeleela: హీరోయిన్ శ్రీలీలకు ముఖ్యమంత్రి స్పెషల్ గిఫ్ట్

Updated on: Apr 05, 2025 | 1:00 PM

గుంటూరు కారం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శ్రీలీల పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ‘కిస్సిక్’ అంటూ కుర్రకారు మనసులు గెల్చుకుంది. ఇప్పుడు మళ్లీ హీరోయిన్ గా రాబిన్ హుడ్ సినిమాతో మన ముందుకు వచ్చింది. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ సినిమాలో యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించాడు. అలాగే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరో కీలక పాత్రలో మెరిశాడు.

భారీ అంచనాలతో ఉగాది కానుకగా రిలీజైన రాబిన్ హుడ్ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో శ్రీలీలకు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే వరుసగా పరాజయాలు ఎదురవుతున్నప్పటికీ ఈ యంగ్ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లోనూ ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోందీ అందాల తార. అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం సిక్కింలో ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీ కరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో హీరో, హీరోయిన్లు కార్తీక్ ఆర్యన్, శ్రీలీల కూడా పాల్గొంటున్నారు. తాజాగా సినిమా యూనిట్ అంతా కలిసి సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్ కోసం సిక్కింను ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే కార్తీక్ ఆర్యన్, శ్రీలీల, అనురాగ్ బసుకు తమ రాష్ట్ర సంప్రదాయం ప్రతిబింబించేలా కొన్ని బహుమతులు అందజేశారు. మూవీ షూటింగ్ పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిస్తాయిలో సహకారం అందిస్తామని చిత్ర బృందానికి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సిక్కిం సీఎంఓ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anchor Pradeep: APకి చెందిన లేడీ పొలిటీషన్‌తో ప్రదీప్‌ పెళ్లి ?? క్లారిటీ..!

ముద్దు సీన్‌లో కంట్రోల్‌ తప్పిన హీరో.. హీరోయిన్‌ చీవాట్లు…

Alekhya Chitti: అలేఖ్య చిట్టి పచ్చళ్ల ఇష్యూలో.. సజ్జనార్‌కు ట్యాగ్ చేస్తున్న నెటిజెన్స్..

పిట్ట కూడా వాలని చెట్టు.. ఎందుకంత డేంజర్‌ ??

Gond Katira: సమ్మర్‌లో గోండ్‌ కటిరా తింటున్నారా.. ఇది మీ కోసమే!