దీపికను టార్గెట్ చేసిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌! ఆగం ఆగం చేస్తున్నారుగా

Updated on: Jun 02, 2025 | 7:28 PM

ప్రభాస్‌ స్పిరిట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లనేలేదు .. అప్పుడే వార్తలలో నిలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన సందీప్ రెడ్డి.. అటు నటీనటుల ఎంపిక.. లోకేషన్స్ వెతికే పనిలో బిజీగా ఉన్నారు. ఇక సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి నటించనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది.

దీంతో ఈ సినిమా హీరోయిన్ విషయంలో నెలకొన్న వివాదం బయటకు వచ్చింది. హీరోయిన్‌గా త్రిప్తిని ప్రకటించిన తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన ట్వీట్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టంచింది. స్పిరిట్ మూవీ లీక్ చేయడంపై డర్టీ పీఆర్ గేమ్స్ అంటూ సీరియస్ అయ్యారు సందీప్ రెడ్డి. ఈ క్రమంలోనే ప్రభాస్‌ను ఇండైరెక్ట్‌గా విమర్శిస్తున్నట్టు దీపికకు సంబంధించిన ఓ వీడియో బయటికి వచ్చింది. ఆ వీడియో కాస్తా ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. సోషల్ మీడియాలో ఓ వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోలో.. దీపిక పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌ పై ఇండైరెక్ట్‌ గా షాకింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. తనకు ఒక దర్శకుడు సినిమా ఆఫర్ చేశారు. క్రియేటివ్ గా అది తనకు బాగా నచ్చింది.. కానీ రెమ్యునరేషన్ విషయానికి వచ్చేసరికి తాను ఇంత ఛార్జ్ చేస్తానని చెప్పాను. అయితే తాము అంత భరించలేం.. ఎందుకంటే తమ హీరో మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అని ఓ డైరెక్టర్ తనతో అన్నాడని దీపిక చెప్పారు. దాంతో తాను టాటా గుడ్ బై అని చెప్పేశాను అన్నారు. అక్కడితో ఆగకుండా… తన ట్రాక్ రికార్డ్ తనకు తెలుసని.. తన విలువ తనకు తెలుసని.. తన సినిమాలు ఆడినంతగా ఆ హీరో సినిమాలు ఆడడం లేదని కూడా తెలుసని.. షాకింగ్ కామెంట్స్ చేసింది దీపిక. అయితే ఈ కామెంట్స్‌ పై తమ హీరోను ఉద్దేశించే దీపిక కామెంట్‌ చేసిందంటూ… ఆమెపై ఫైర్ అవుతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓటీటీలు గట్రా లేవ్‌.. నా సినిమాను నేరుగా యాట్యూబ్‌లో వేస్తా

నల్లని ఒత్తయిన జుట్టు కోసం.. ఇదొక్కటి చాలు

పొలానికి వెళ్లిన అతని ఫేట్ తిరిగిపోయింది.. ఒక్కరాయి జీవితాన్నే మార్చేసింది

ఈ పండుతో ఇన్ని లాభాలా? తెలిస్తే అస్సలు వదలరు!

బెడ్‌పై నిద్రపోతుండగా.. యువకుడి పైకి పాకుతూ వచ్చిన రాచనాగు.. కట్ చేస్తే