‘మా బావ ఎన్నో కష్టాలు పడ్డాడు..’ నమ్రత సిస్టర్‌ ఎమోషనల్ కామెంట్స్

Updated on: Jul 27, 2025 | 9:04 PM

ఎవరికైనా కుటుంబమే అండ! అలాంటి కుటుంబంలో ఒక్కొక్కరుగా తిరిగిరాని లోకాలకు వెళుతుంటే.. తట్టుకోవడం ఎంత కష్టం. ఆ బాధను భరించడం ఎంత దుర్బరం. కానీ తన బావ ఆ కష్టాన్నే తన పంటికింద భరించి మరీ.. నవ్వుతూ కనిపించారని ఎమోషనల్ కామెంట్స్ చేశారు నమ్రత చెల్లి.. శిల్ప శిరోద్కర్. ఒక్కప్పుడు బాలీవుడ్‌లో బిజీగా ఉన్న శిల్పా శిరోద్కర్‌... ఇప్పుడు దుబాయ్‌లో తన ఫ్యామిలీతో సెటిల్ అయ్యారు.

అక్కడే హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈమె.. మహేష్ గురించి మహేష్ పడ్డ బాధల గురించి ఎమోషనల్ గా మాట్లాడారు. ఈ ప్రపంచంలో తనకు తెలిసిన అత్యుత్తమ మనుషుల్లో మహేశ్‌ బావ ఒకరని చెప్పిన శిల్పా శిరోద్కర్‌.. మహేష్‌ బావ ఫ్యామిలీ కోసం చాలా ధృడంగా నిలబడతాడని చెప్పారు. అయితే మహేష్ బావ చాలా కష్టాలు చూశాడని… తల్లిదండ్రులను, సోదరుడుని వెంట వెంటనే కోల్పోయి పుట్టెడు దుఃఖంతో సతమతమయ్యాడని చెప్పారు. అంతేకాదు అంతబాధలోనూ తనను అభిమానించే వారికోసం చిరునవ్వుతో కనిపించేవాడన్నారు. తాము పేరెంట్స్‌ను కోల్పోయినప్పుడు మహేషే అక్కను ఓదార్చారని.. ఆ బాధ నుంచి తొందరగా బయటపడేలా చేశాడని చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్‌ బాస్‌.. సల్మాన్‌కు రూ.100 కోట్లు లాస్‌!

ఫిష్ వెంకట్‌ కుటుంబానికి అండగా సోనూసూద్‌

సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ?

‘హృతిక్‌ను కొట్టిపడేసిన యంగ్ టైగర్‌’ అది తెలుగోడి పెర్ఫార్మెన్స్‌ అంటే..!

దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో.. ఫ్లాట్ కొన్న స్టార్ హీరోయిన్.. ధర తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే!