Sharwanand: ఎట్టకేలకు విడాకుల వార్తలకు చెక్ పెట్టిన శర్వా
హీరో శర్వానంద్ తన భార్య రక్షితతో విడాకుల వార్తలపై పరోక్షంగా స్పందించారు. తన కూతురు పుట్టిన తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, కుటుంబం కోసం బలంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సిక్స్ ప్యాక్ సాధించినట్లు చెప్పిన శర్వానంద్, తన కొత్త లుక్ వెనుక గల కారణాన్ని వివరించి, విడాకుల ఊహాగానాలకు పరోక్షంగా ముగింపు పలికారు.
హీరో శర్వానంద్ తన భార్య రక్షితతో విడిగా ఉంటున్నట్టు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తొందర్లో వీరిద్దరూ అఫీషియల్‌గా విడాకులు తీసుకోబోతున్నారనే టాక్ కూడా ఫిల్మ్ టౌన్‌లో వినిపించింది. కానీ శర్వా నుంచి ఈ న్యూస్‌పై ఎలాంటి రియాక్షన్ రాకపోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కట్ చేస్తే ఈ న్యూస్ పై ఎట్టకేలకు రియాక్ట్ అయ్యాడు ఈ హీరో. అయితే డైరెక్ట్‌గా కాకుండా.. ఇన్‌డైరెక్ట్‌గా ఈ విషయం గురించి మాట్లాడాడు ఈ హీరో. ఇటీవలే శర్వానంద్ బక్కచిక్కిన బాడీతో కనిపించి షాక్ ఇచ్చాడు. సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి అదరగొట్టారు. తాజాగా తన లుక్ పై ఓ క్లారిటీ ఇచ్చిన శర్వానంద్.. ఈ క్రమంలోనే తన విడాకుల గురించి క్లారిటీ ఇచ్చాడు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన శర్వా.. ఆరోగ్యమే మహాభాగ్యం అని.. తన కూతురు పుట్టాకే తెలిసొచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే తన శరీరం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నా అన్నాడు. తన కుటుంబం కోసం స్ట్రాంగ్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చాడు. అలా తన విడాకులు వార్తలను కొట్టేశాడు ఈ స్టార్ హీరో.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Abhishek Bachchan: నా హృదయం ముక్కలైంది.. అభిషేక్ బచ్చన్ ఎమోషనల్ పోస్ట్
ఉన్న వివాదం చాలదన్నట్టు 3 కోట్లు పెట్టి మరో లగ్జరీ కారు అవసరమా
తమన్నాతో మెగాస్టార్ చిందులు.. అనిల్ మైండ్లో ఖతర్నాక్ ప్లాన్
నీ ఇష్టమొచ్చినప్పుడు దిగనీకి బిగ్ బాస్ ఏమన్నా బస్సా..’ శివాజీ ప్రశ్నల ధాటికి బిత్తర పోయిన రాథోడ్
