Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో నో కాంప్రమైజ్
దర్శకుడు శంకర్ రూ.600 కోట్లతో 'వేల్పరి' చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందించే ప్రణాళికలో ఉన్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌కు హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని వాడతానంటున్నారు. అయితే, గత చిత్రాలతో నిర్మాతలు భారీగా నష్టపోయిన నేపథ్యంలో, ఈ భారీ బడ్జెట్‌కు ఎవరు ముందుకొస్తారనేది ప్రశ్నార్థకం. స్టార్ నటులను ఒప్పించినా, ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం సవాలే.
మాట తప్పేదే లే.. వెనక్కి తగ్గేదే లే అంటున్నారు దర్శకుడు శంకర్. నేనొక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అంటున్నారీయన. అనుకున్నాను.. అది అవ్వాల్సిందే.. ఆరు నూరైనా అనుకున్న పని చేసి చూపిస్తానంటూ మరోసారి కన్ఫర్మ్ చేసారు శంకర్. తన డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారు ఈ దర్శకుడు. మరి అది సాధ్యమవుతుందా..? దర్శకుడు శంకర్ కెరీర్ పరిస్థితి ఇప్పుడెలా ఉందో చెప్పనక్కర్లేదు. ఇండియన్ 2తోనే సగం ఇమేజ్ పోతే.. గేమ్ ఛేంజర్‌తో అది సంపూర్ణమైంది. భారీ అంచనాలు పక్కనబెడితే.. భారీగా ఖర్చు చేయించి నిర్మాతలను నిండా ముంచేసారు ఈ దర్శకుడు. అందుకే ఇప్పుడు శంకర్‌తో సినిమా అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు నిర్మాతలు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే తన తర్వాతి సినిమా వేల్పరి పుస్తకం ఆధారంగానే తెరకెక్కించబోతున్నారు శంకర్. ప్రముఖ రచయిత సు వెంకటేశన్ రాసిన వీరయుగ నాయకన్ వేల్పరి పుస్తకం ఆధారంగా ఈ సినిమాను 3 భాగాలుగా తెరకెక్కించాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. దీనికోసం 600 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందని అంచనా. పొన్నియన్ సెల్వన్ స్థాయిలో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవతార్ లాంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లోని టెక్నాలజీని వేల్పరితో ఇండియన్ సినిమాకు పరిచయం చేస్తానంటున్నారు శంకర్. విక్రమ్, కార్తి, సూర్య, శివకార్తికేయన్ లాంటి స్టార్స్‌ను ఒప్పించే పనిలో ఉన్నారు ఈ దర్శకుడు. జూన్ 2026 నుంచి షూటింగ్ షురూ కానుందని తెలుస్తుంది. అంతా బాగానే ఉన్నా.. శంకర్‌ను నమ్మి అంత బడ్జెట్ పెట్టే నిర్మాతలెవరు అనేదే మెయిన్ డౌట్ ఇప్పుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: సమంతకు రూ.కోట్లు విలువ చేసే గిఫ్ట్ ఇచ్చిన భర్త రాజ్
సెలబ్రిటీ వెడ్డింగ్‌లో కనిపిస్తున్న ఎరుపు రంగు చీరలు
Samantha: సమంత పెళ్లి వెనక పెద్ద కథే ఉందిగా
Akhanda 2: బాలయ్యకు గుడ్ న్యూస్ ఏపీలో బెనిఫిట్ షోలకు ఆ ధరకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో?
‘ఆ టాలీవుడ్ హీరో భార్య నుంచి రక్షించండి’ పోలీస్ స్టేషన్‌కు శేఖర్ బాషా!
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

