King Khan back: ఎట్టకేలకు షూట్ కోసం లొకేషన్‌లో ప్రత్యక్షం అయిన బాలీవుడ్ బాద్‌షా..(వీడియో)
డ్రగ్స్ కేసులో కుమారుడు ఆర్యన్‌ఖాన్ అరెస్ట్ కావడంతో ఆ ప్రభావం కింగ్ ఖాన్ సినిమాలపై పడింది. 2018లో విడుదలైన ‘జీరో’ చిత్రంతో వెండితెరపై కనిపించిన షారుఖ్ ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన సినిమాలు ఇంకా విడుదల కాలేదు. కాగా..
డ్రగ్స్ కేసులో కుమారుడు ఆర్యన్‌ఖాన్ అరెస్ట్ కావడంతో ఆ ప్రభావం కింగ్ ఖాన్ సినిమాలపై పడింది. 2018లో విడుదలైన ‘జీరో’ చిత్రంతో వెండితెరపై కనిపించిన షారుఖ్ ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన సినిమాలు ఇంకా విడుదల కాలేదు. కాగా.. తాజాగా నిలిచిపోయిన ‘పఠాన్’తో పాటు దర్శకుడు అట్లీ చిత్రం షూటింగ్‌ల కోసం షారుఖ్ ముంబైలో తిరిగి సెట్స్‌లోకి వచ్చారు. కుమారుడు ఆర్యన్ అరెస్ట్ వ్యవహారం సద్దుమణిగిన నేపథ్యంలో ఆగిపోయిన రెండు సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం మొదలైనట్లు సమాచారం. పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వచ్చేవరకూ గ చిత్రాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు షారుఖ్. ‘పఠాన్’ చిత్రానికి సంబంధించి కొంత భాగం స్పెయిన్‌లో షూట్ పూర్తి చేసుకుంది. పఠాన్‌లో షారుఖ్ సరసన దీపిక పదుకొణె నటిస్తోంది. అట్లీ దర్శకత్వంలో తదుపరి చిత్రం షూటింగ్.. సౌత్‌ముంబయిలో జరగాల్సి ఉండగా.. అది కూడా వాయిదా పడింది. ప్రస్తుతం రూమర్స్‌కు తెర దించుతూ షూటింగ్‌కి రెడీ అయ్యారు కింగ్ ఖాన్.