ఒకప్పడు వాళ్లదే చరిత్ర.. ఇప్పుడు గత చరిత్ర

Edited By: Phani CH

Updated on: Dec 04, 2025 | 5:51 PM

ఒకప్పుడు చరిత్ర సృష్టించిన టాలీవుడ్ సీనియర్ దర్శకులు కొరటాల శివ, వి.వి. వినాయక్, శ్రీను వైట్ల, సురేందర్ రెడ్డి వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. సినిమా పరిశ్రమలో వారి భవిష్యత్తు, పూర్వ వైభవం ప్రశ్నార్థకంగా మారింది. ఈ దర్శకులు తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కి పునర్వైభవం సాధించగలరా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఒకప్పుడు చరిత్ర సృష్టించిన డైరెక్టర్స్ గత చరిత్రగా మిగిలిపోతున్నారా..? అప్పట్లో రికార్డులు తిరగరాసిన ఆ దర్శకుల పేర్లు.. ఇకపై కేవలం పాత రికార్డుల్లో చూసుకోవాల్సిందేనా..? దశాబ్ధం పాటు దంచికొట్టిన వాళ్లందరూ దారి తప్పారా..? టాలీవుడ్‌లో ఆ సీనియర్ డైరెక్టర్స్ బౌన్స్ బ్యాక్ అవుతారా..? అసలు అంతగా ఇబ్బంది పడుతున్న ఆ దర్శకులెవరో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? సినిమా ఇండస్ట్రీలో టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇక్కడ ఒక్క శుక్రవారం చాలు జాతకాలు తారుమారు కావడానికి..! అలా ఒకప్పుడు చరిత్ర సృష్టించిన కొందరు సీనియర్ దర్శకులు.. కొన్నేళ్లుగా తమదైన రోజు కోసం వేచి చూస్తున్నారు. అందులో ముందుగా కొరటాల శివ గురించే చెప్పాలి.. ఆచార్యకు ముందు వరకు ఈయన తోపు.. కానీ ఆ తర్వాతే సీన్ మారిపోయింది. దేవరతో బ్లాక్‌బస్టర్ కొట్టినా.. ఎన్టీఆర్ స్టార్ పవర్‌తో ఆడిందన్నారు. దేవర 2పైనే ఏడాదిన్నరగా వర్క్ చేస్తున్నారు కొరటాల.. కానీ అది ఆగిపోయిందనే వార్తలే వినిపిస్తున్నాయిప్పుడు. దాంతో కొరటాల ఫ్యూచర్ అగమ్యగోచరంగా మారిందిప్పుడు. ఇక మరో సీనియర్ డైరెక్టర్ వివి వినాయక్ సైతం చాలా ఏళ్లుగా కనబడట్లేదు. ఈయన చివరి సినిమా ఇంటిలిజెంట్ 2018లో విడుదలైంది. వినాయక్ తీరు చూస్తుంటే ఆయనకు గత వైభవం కష్టమే. పునర్వైభవం కోసం కష్టపడుతున్న మరో సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల. పదేళ్ళ పాటు తన కామెడీతో టాలీవుడ్‌ను ఉర్రూతలూగించారీయన. కానీ పదేళ్లుగా సరైన సక్సెస్ కోసం చూస్తున్నారు శ్రీను వైట్ల. దూకుడు, బాద్షా తర్వాత ఈయనకు హిట్ లేదు. గతేడాది గోపీచంద్‌తో చేసిన విశ్వం సైతం అంచనాలు అందుకోలేదు. విశ్వం తర్వాత కొత్త ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తున్నా.. శ్రీను వైట్లకు వర్కవుట్ అవ్వట్లేదు. ఇప్పటికిప్పుడు బ్లాక్‌బస్టర్ పడితే కానీ మునపటి శ్రీను వైట్ల మళ్లీ కనబడటం కష్టమే. అలాగే ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డి సైతం డైలమాలో ఉన్నారు. పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటున్నారు కానీ దానిపై క్లారిటీ రావట్లేదు. మొత్తానికి ఈ సీనియర్ డైరెక్టర్స్ మళ్లీ సత్తా చూపించేదెప్పుడో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: సమంతకు రూ.కోట్లు విలువ చేసే గిఫ్ట్ ఇచ్చిన భర్త రాజ్‌

సెలబ్రిటీ వెడ్డింగ్‌లో కనిపిస్తున్న ఎరుపు రంగు చీరలు

Samantha: సమంత పెళ్లి వెనక పెద్ద కథే ఉందిగా

Akhanda 2: బాలయ్యకు గుడ్‌ న్యూస్ ఏపీలో బెనిఫిట్ షోలకు ఆ ధరకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో?

‘ఆ టాలీవుడ్ హీరో భార్య నుంచి రక్షించండి’ పోలీస్‌ స్టేషన్‌కు శేఖర్ బాషా!