ఆ సినిమాలతో నిర్మాతలకు చుక్కలు తప్పట్లేదుగా.. ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి
తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు నిరంతరం ఫెయిల్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్లు నటించినా, అరుంధతి, మహానటి వంటి కొన్ని విజయాలు మినహా, కమర్షియల్ సక్సెస్ దూరమవుతోంది. పోస్టర్ ఖర్చులు కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. కథల ఎంపికలో లోపాలు, ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోవడమే ఈ వైఫల్యాలకు ప్రధాన కారణాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఆలోచించాల్సిన టైమ్ వచ్చేసిందా..? హీరోయిన్లపై బడ్జెట్ అస్సలు వర్కవుట్ అవ్వట్లేదా..? నటించడానికి వాళ్లు సిద్ధంగానే ఉన్నా కథల విషయంలోనే అసలు తేడా జరుగుతుందా..? కనీసం పోస్టర్ ఖర్చులు రాలేనంతగా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలెందుకు చేతులెత్తేస్తున్నాయి..? అసలేంటి మ్యాటర్..? లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరసగా వస్తూనే ఉన్నాయి కానీ అందులో ఏడాదికి ఒక్కటి కూడా వర్కవుట్ అవ్వట్లేదు. అప్పుడెప్పుడో అరుంధతి.. తర్వాత భాగమతి.. కొన్నాళ్ళకు మహానటి.. గత దశాబ్ధంలో బాగా గుర్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఇవే. ఏడాదికి కనీసం 20 ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు వస్తున్నా.. కనీసం ఒక్క పర్సెంటేజ్ సక్సెస్ రావట్లేదు. ఎక్కడివరకో ఎందుకు..? 2025నే తీసుకుందాం.. ఈ ఏడాది లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. అందులోనూ స్టార్ హీరోయిన్లు నటించిన సినిమాలే చాలా వచ్చాయి. మొన్నటికి మొన్న కీర్తి సురేష్ రివాల్వర్ రీటా సినిమా వచ్చింది. కానీ అది వచ్చిన విషయం కూడా ఆడియన్స్‌కు ఐడియా లేదు. మహానటి తర్వాత కీర్తి నటించిన ఏ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా సైతం ప్రశంసల దగ్గరే ఆగిపోయింది కానీ కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. ఇదే విషయాన్ని అనుపమ సైతం చెప్పారు.. పోస్టర్లపై హీరోయిన్ల బొమ్మ ఉంటే చూడ్డానికి ఆడియన్స్ రారు అని..! ఇక రెండేళ్ళ తర్వాత అనుష్క శెట్టి ఘాటీ.. సంపత్ నందితో తమన్నా చేసిన ఓదెల 2 సైతం దారుణంగా నిరాశ పరిచాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకప్పడు వాళ్లదే చరిత్ర.. ఇప్పుడు గత చరిత్ర
TOP 9 ET News: సమంతకు రూ.కోట్లు విలువ చేసే గిఫ్ట్ ఇచ్చిన భర్త రాజ్
సెలబ్రిటీ వెడ్డింగ్‌లో కనిపిస్తున్న ఎరుపు రంగు చీరలు
Samantha: సమంత పెళ్లి వెనక పెద్ద కథే ఉందిగా
Akhanda 2: బాలయ్యకు గుడ్ న్యూస్ ఏపీలో బెనిఫిట్ షోలకు ఆ ధరకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో?
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

